Moviesఆ లవ్ స్టోరీతో..నా సరికొత్త లైఫ్ మొదలు..విజ‌య్ దేవ‌ర‌కొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఆ లవ్ స్టోరీతో..నా సరికొత్త లైఫ్ మొదలు..విజ‌య్ దేవ‌ర‌కొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఫీల్‌గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి.ఇక ఈ సినిమాలోని ‘సారంగ దరియా’ పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చై-సాయి పల్లవిల కెమిస్ట్రీ అదిరిపోనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా చైతు కెరీర్‌లో మంచి సినిమాగా నిలుస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.

ఇక ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం..ఓసారి కరోనా కారణంగా..ఓసారి షూటింగ్స్ కారణంగా ఇలా పలుసారు ఈ సినిమా రిలీజ్ చేద్దామని చెప్పి మళ్లి పోస్ట్ పోన్ చేసారు. ఇక ఫైనల్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు చిత్ర బృందం. ఈ నెల 24 న ఈ సినిమా ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక దీని పై రౌడీ హీరో విజయ్ దేవరకొండా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

రౌడీ బాయ్ విజయ్ దేవ‌ర‌కొండ ఒక‌వైపు న‌టుడిగా రాణిస్తూనే మ‌రోవైపు బిజినెస్‌లో దూసుకుపోతున్నాడు. తాజాగా మ‌ల్లీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్ట‌బోతున్న‌ట్టు స్వ‌యంగా ప్ర‌క‌టించాడు. అగ్రశ్రేణి పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్‌తో కలిసి దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఏవీడీ సినిమాస్ పేరుతో మ‌ల్లీ ప్లెక్స్ థియేట‌ర్‌ని తన స్వస్థలమైన మహాబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు విజయ్ దేవరకొండ‌. ల‌వ్‌స్టోరీ సినిమాతో ఈ థియేట‌ర్ ప్రారంభం కానుంద‌ని ఆయ‌న తెలియ‌జేశారు.

లవ్ స్టోరీ’ సినిమా విషయానికొస్తే.. ఫిదా తర్వాత మరోసారి తెలంగాణ నేపథ్యంలోనే ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల. లవ్ స్టోరీ షూటింగ్ నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ చేసారు దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news