ప్రతి ఏటా వివిధ రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించి ‘సాక్షి’ఎక్సలెన్స్ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల 6 వ, 7 వ ఎడిషన్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ క్రమమ్ళొ సాక్షి ఎక్స్లెన్స్ అవార్డు వేదికపై సూపర్ స్టార్ మహేష్ బాబు మెరిశారు. మహేష్ బాబు ఉత్తమ నటుడు అవార్డు కైవశం చేసుకున్నారు.
2019లో విడుదలైన మహర్షి చిత్రంలోని నటనకు గాను సాక్షి ఎక్సలెన్స్ అవార్డుకి మహేష్ ఎంపిక కావడం జరిగింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ వేడుకలో మహేష్ స్వయంగా పాల్గొని, అవార్డు అందుకున్నారు. మహర్షి చిత్రానికి మూడు అవార్డ్స్ దక్కడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక అల్లు అర్జున్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన “అల వైకుంఠపురములో” సినిమా వివిధ విభాగాలలో మొత్తం ఐదు అవార్డులు సొంతం చేసుకుంది.
‘సాక్షి’ఎక్సలెన్స్ అవార్డులను గెలుచుకునందుకు గాను అల్లు అర్జున్ బృందం సంతోషం వ్యాక్తం చేసింది. ఈ సినిమాకు గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడు, పూజా హెగ్డే ఉత్తమ నటి అవార్డులను గెలుచుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఉత్తమ చిత్రం అవార్డును నిర్మాత రాధా కృష్ణ అందుకోగా… థమన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు సాధించాడు. “అల వైకుంఠపురములో” మూవీ భారీ కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ మరియు సన్ ఎన్‌ఎక్స్‌టిలో ప్రసారం అవుతోంది.