టాలీవుడ్లో హీరోల పైకి ఎన్ని కౌగిలింతలు ముద్దులు పెట్టుకున్నా వారి మధ్య లోపల మాత్రం ఇగోలు, ప్రచ్ఛన్న యుద్ధాలు మామూలుగా ఉండవు. ఈ ఇగోలు ఇప్పుడు కాస్త తగ్గినట్టు ఉన్నా 2000వ దశకం వరకు చాలా ఎక్కువుగా ఉండేవి. స్టార్ హీరోల అభిమానులు సైతం తమ హీరో సినిమాయే ఆడాలని చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక 1990వ దశకంకు కాస్త ముందు నుంచే టాలీవుడ్లో నలుగురు హీరోల మధ్యే ప్రధానంగా పోటీ ఉండేది.
చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున – వెంకటేష్ తమ సినిమాలతో పోటీపడుతూ బాక్సాఫీస్‌ను హీటెక్కించేవారు. ఈ క్రమంలోనే ఓ దర్శకుడు ముందుగా ఏదైనా కథ తీసుకుని తన దగ్గరకు వస్తే ఆ కథ బాగుండి తాను బిజీగా ఉన్నా ఏదోలా లాక్ చేసేసేవారు. చాలా మంది హీరోలు అలాగే చేసేవారట. అయితే యువరత్న నందమూరి బాలకృష్ణ మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంటారు. ఏదైనా స్ట్రైట్ ఫార్వార్డ్‌గా మాట్లాడే బాలయ్య తన పనేదో తాను చేసుకుపోతారే తప్పా ఇతర హీరోల సినిమాల గురించి ఆరాలు పేరాలు తీయడం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు.
ఇక మన టాలీవుడ్లో ఎవరో ఒకరిద్దరు మినహా అందరు హీరోలు, స్టార్ హీరోలు డైరెక్షన్లో కూడా కాళ్లు, వేళ్లు పెట్టేస్తూ దర్శకులతో పాటు అటు నిర్మాతలకు సైతం నరకం చూపించేస్తుంటారు. అయితే ఈ విషయాన్ని ఏ దర్శకుడు కూడా బయట పెట్టుకోరు. అలా చేస్తే ఆ తర్వాత ఎక్కడ తమకు ఛాన్సులు లేకుండా చేస్తారోనని వారి భయం. బాలయ్య మాత్రం ఓ సారి సినిమాకు కమిట్ అయ్యాక ఎక్కడా డైరెక్షన్లో జోక్యం చేసుకోరు. ఈ విషయంలో ఇండస్ట్రీ మొత్తం మీద ఆయనకు మించిన మంచి మార్కులు ఏ హీరోకు ఉండవు.
బాలయ్యకు హీరోయిన్లు లేకుండా కుట్ర జరిగిందా ?
1990వ దశకం ఆ తర్వాత 2000 వరకు ఉన్న తీవ్రమైన పోటీ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలు బాలయ్య పక్కన స్టార్ హీరోయిన్లు సెట్ కాకుండా విశ్వ ప్రయత్నాలు చేసేవారట. ఆ ఇద్దరు హీరోయిన్లు కూడా అప్పటి హీరోయిన్లపై ఒత్తిడి చేసి తమతో మళ్లీ ఛాన్సులు రావాలంటే బాలయ్య పక్కన నటించకూడదన్న కండీషన్లు పెట్టేవారట. ఇలా ఇద్దరు హీరోల నుంచి ఒత్తిళ్లు రావడంతోనే బాలయ్య పక్కన చాలా మంది హీరోయిన్లకు నటించాలన్న కోరిక ఉన్నా కూడా ఛాన్సులు వదులుకున్న సందర్భాలు ఉన్నాయని అప్పట్లో చర్చ ఉండేది.
బాలయ్య – సౌందర్య కాంబినేషన్లో ఒక్క సినిమా మాత్రమే వచ్చింది. అలాగే రమ్యకృష్ణకు బాలయ్య పక్కన ఎక్కువ ఛాన్సులు వచ్చినా కూడా ఆమెపై ఒత్తిళ్లతోనే కొన్ని వదులుకుందని టాక్ ? ఇక శ్రీదేవి – బాలయ్య కాంబినేషన్ ఎక్కడ సెట్ అవుతుందో ? అని అప్పట్లో ఆ ఇద్దరు స్టార్ హీరోలు పనికట్టుకుని మరీ ప్లాన్లు వేసి చెడగొట్టేసేవారట. అయితే బాలయ్య మాత్రం ఇవేవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూనే ఎలాంటి హీరోయిన్లను పెట్టుకున్నా ఇండస్ట్రీ హిట్లు కొట్టి తన స్టామినా ఫ్రూవ్ చేసుకునేవారు.