Moviesఒకవేళ షణ్ముఖ్ బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే..వాడితో రోజంతా అలా..మైండ్ బ్లాకింగ్...

ఒకవేళ షణ్ముఖ్ బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే..వాడితో రోజంతా అలా..మైండ్ బ్లాకింగ్ షాకిచ్చిన యాంకర్..?

సోషల్ మీడియా స్టార్స్‌కు ఉండే ఫాలోయింగ్ వేరబ్బా.. ఒకప్పుడు డబ్ స్మాష్ ఆ తరువాత టిక్ టాక్ అంటూ ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. ఇక యూట్యూబ్‌లో అయితే వెబ్ సిరిస్‌లు, షార్ట్ ఫిల్మ్స్‌ల ద్వారా ఎంతో మంది స్టార్లుగా మారారు. అందులోంచి కొంత మంది బిగ్ బాస్ షోలోకి వచ్చారు. అలా దీప్తి సునయన బిగ్ బాస్ షోతో బాగానే ఫేమస్ అయ్యారు. ఇక దీప్తి సునయన బిగ్ బాస్ షోలో పదే పదే షణ్ముఖ్ పేరు చెప్పడం, తలుచుకోవడంతో అతను కూడా ఫేమస్ అయ్యారు. దీప్తి సునయన, షణ్ముఖ్ మధ్య వ్యవహారం ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది.

షణ్ముఖ్ జస్వంత్.. ఈ పేరు చాలా మందికే పరిచయం. ముఖ్యంగా యూట్యూబ్‌ను రెగ్యులర్ చూస్తుంటే షణ్ముఖ్ ఎవరు తెలుస్తుంది. ఇతనో సోషల్ మీడియా స్టార్. షణ్ముక్ జస్వంత్ యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్, డాన్స్ వీడియోలతో చాలా ఫేమస్ అయ్యాడు. ఈ మధ్య కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా తీస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో వచ్చిన సాప్ట్ వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈయన బిగ్ బాస్ 5 లో అడుగుపెట్టి .. తనదైన స్టైల్లో ఆట ఆడుతూ..ఎంటర్ టైన్ చేస్తున్నారు.

హౌస్ లో ఈయన విషయం పక్కన పెడితే..బయట మాత్రం ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. షో స్టార్ట్ అయ్యి కేవలం ఒక్క వారమే అయినా..ఆయన అభిమానులు మాత్రం షణ్ముఖ్ నే బిగ్ బాస్ విన్నర్ అని ఫిక్స్ అయిపోయారు. అలా ఉంది బయట పరిస్ధితి. ఇదిలా ఉంటే షణ్ముఖ్ గెలిస్తే మాత్రం ఒక రోజంతా వాడితో అలా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది యాంకర్ విష్ణు ప్రియ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ప్రియ షణ్ముఖ్ జశ్వంత్ గురించి కొన్ని ఓపెన్ కామెంట్స్ చేసింది. తనకు షణ్ముఖ్ అంటే ఇష్టమని.. ఒకవేళ షణ్ముఖ్ మాత్రం బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా గెలిస్తే ఒక రోజంతా వాడితో డేటింగ్ కు బయటికి వెళ్తా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news