Moviesసైలెంట్ షాకిచ్చిన జబర్ధస్త్ కమెడియన్..కాబోయే భార్య ఫోటో పోస్ట్ చేసిన అవినాష్..!!

సైలెంట్ షాకిచ్చిన జబర్ధస్త్ కమెడియన్..కాబోయే భార్య ఫోటో పోస్ట్ చేసిన అవినాష్..!!

జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా చాలా త‌క్కువ టైంలోనే మంచి పాపులార్ అయ్యాడు అవినాష్‌. ఈ క్ర‌మంలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్‌బాస్ హౌస్‌లోకి వ‌చ్చాడు. అప్ప‌టి వ‌ర‌కు బిగ్‌బాస్ హౌస్‌లో లేని ఎట్రాక్ష‌న్ అవినాష్ ఎంట్రీతో వ‌చ్చింది. అవినాష్ చేస్తోన్న కామెడీకి అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. అవినాష్ వ‌చ్చాకే బిగ్‌బాస్ రేటింగ్‌లు కాస్త పుంజుకున్నాయ‌నే చెప్పాలి. క్కడ తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడమే కాకుండా మరో లేడీ కంటెస్టెంట్, యాంకర్ అరియానాతో స్నేహం, లవ్ అంటూ వార్తల్లో నిలిచాడు. అప్పటి నుంచి అవినాష్, అరియనా మధ్య ఏదో ఉందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇక బిగ్‏బాస్‏ ఇంటి నుంచి వచ్చిన తర్వాత నెట్టింట్లో అవినాష్ చేసిన హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీముఖితో కలిసి అవినాష్ వీడియోలు చేస్తూ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ వచ్చాడు. బిగ్ బాస్ ఇంట్లో అవినాష్ కలిపిన పులిహెర, అతని ట్రాకుల గురించి మనందరికీ తెలుసు. అదే సమయంలో ఆయన పెళ్లి మ్యాటర్ కూడా తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా అవినాష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల అవినాష్ నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అవినాష్ తన ఇన్‏స్టాలో షేర్ చేశారు.

ఇటీవల అవినాష్… అనూజ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని అవినాష్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఎంగెజ్‏మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఎక్కువ రోజులు వెయిట్ చేసిన తర్వాత సరైన వ్యక్తి మీ జీవితంలో వచ్చేస్తారు. మా కుటుంబాలతో పాటు మేము కలిసాం.

మీరందరూ నన్ను చాలాసార్లు అడిగారు మీ పెళ్లి ఎప్పుడూ అని.. అతి త్వరలోనే నా అనూజతో.. ఎప్పటి లాగే మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా మీ ముక్కు అవినాష్.. సారీ అనూజ అవినాష్ అంటూ పోస్ట్ చేశాడు అవినాష్. ప్రసుతం అవినష్ పోస్ట్ వైరల్ గా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by Mukku Avinash (@jabardasth_avinash)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news