Moviesఫస్ట్ టైం తారక్ కోసం రాజమౌళి అలా..లీకైన పిక్..నెట్టింట వైరల్..?

ఫస్ట్ టైం తారక్ కోసం రాజమౌళి అలా..లీకైన పిక్..నెట్టింట వైరల్..?

ఎన్టీఆర్ ఇప్పుడు సినీ తెర మీదే కాదు బుల్లి తెర మీద కూడా మంచి క్రేజ్ సంపాదించేసాడు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షోతో తెలుగు బుల్లితెర మీద పెద్ద సెన్షేష‌న్ క్రియేట్ చేశాడు. మొన్నామధ్య వచ్చిన బిగ్ బాస్ షో ద్వారా ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగులో భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ షో తొలి సీజ‌న్ ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో చూశాం. ఆ తరువాత హీరో నాని ,హీరో అక్కినేని నాగారజున షో ని హోస్ట్ చేసినా..తారక్ స్దాయి ని రీచ్ కాలేకపోయారు. ఆ మాట‌కు వ‌స్తే ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్‌లో తొలి సీజ‌న్‌లో ఉన్నంత ఊపు మిగిలిన సీజ‌న్లలో లేద‌నే చెప్పాలి. ఎన్టీఆర్ ఎన‌ర్జీ, ఛ‌రిష్మా బిగ్‌బాస్‌ను టాప్ లెవ‌ల్లో నిల‌బెట్టేశాయి.

ఈసారి ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తుండటంతో ఈ షో కోసం కోట్లాదిమంది అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ మాటల తూటాలు బుల్లితెర ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇందులో తారక్ మీసకట్టు లుక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. ఇక ఈ షోలో మొదటి గెస్ట్ గా “RRR” కో స్టార్ రామ్ చరణ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మీలో ఎవరు కోటీశ్వరుడు అన్నపూర్ణ స్టూడియోస్‌ లో షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇక అక్కడ సడేన్ గా దర్శక దిగ్గజ ధీరుడు రాజమౌళి కనిపించాడు. దీంతో అసలు అక్కడ ఆయన ఏం చేస్తున్నారని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

స్టూడియోస్ లో జక్కన కనిపించడం పెద్ద స్పెషల్ ఏమి కాదు.. కానీ అదే స్టూడియో లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ గేమ్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” షూటింగ్ జరుగుతోంది చూసారా…అదే ఇక్కడ మైయిన్ పాయింట్. రాజమౌళి కారు దిగి స్టూడియోలోకి వెళ్తున్నట్లుగా ..అదే టైంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టూడియోలో నుంచి బయటికి వస్తూ.. దర్శకుడు రాజమౌళి లోపలికి తీసుకెళ్తున్నారు. దీంతో “ఎవరు మీలో కోటీశ్వరులు” ప్రోగ్రాంకి రాజమౌళి అతిథిగా వచ్చారని టాక్ నడుస్తోంది. ఇదంతా ఎలా బయటకి వచ్చిమిది అనుకుంటున్నారా..?? ఇది ఒక నెటిజెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news