శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఇప్పతికే ఎన్నో స్సర్లు వాయిదా పడిన ఈ సినిమా సెప్టంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్రాండ్ గా ఈ సినిమాను ధియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసారు మేకర్స్.
అయితే, ఈ సినిమా తరువాత నాగ చైతన్య వరుస సినిమాలకు సై చేసాడు. తన తండ్రి తో కలిసి బంగార్రజు అనే మూవీలో హీరోఘా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈయన పక్కన ఉప్పెన బ్యూటి కృతిశెట్టి నటిస్తుంది.ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వెబ్ సిరీస్ లు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాగా చైతన్య.
“13బి”, “24” సినిమాలకి దర్శకత్వం వహించిన విక్రమ్ కె కుమార్ తో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు చై. అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్లో విడుదల కాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు హీరోగా అలరించిన ఆయన ఈ వెబ్ సిరీస్ కోసం విలన్గా నటించడానికి రెడీ అయ్యారని సమాచారం. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
యంగ్ హీరోలు కార్తికేయ, రానా లాగే తాను కూడా విలన్గా సత్తా చాటాలని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇక ఈ విషయమై పలువురు పెద్దలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నెగిటివ్ రోల్ లో సెట్ అయితే ఓకే కాని బెడిసికొట్టిందంటే అటు హీరో గా చేయలేక ఇటు విలన్ గా కలిసి రాక బొక్కబోర్ల పడతాడు చై అంటున్నారు. హారర్ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ వెబ్ సిరీస్ తో నాగచైతన్య ఓటీటీలలో సైతం అడుగు పెట్టనున్నాడు.