టాలీవుడ్లో గత కొంత కాలంగా హాట్ డిస్కర్షన్ ఏదైనా ఉందా ? అంటే అది చైతు – సమంత విడాకుల వ్యవహారమే. వార్తలు ఎలా ఉన్నా సమంత పెడుతోన్న పోస్టులు అయితే వీరి మధ్య గ్యాప్‌ను బలపరిచేలా ఉన్నాయి. సమంత తన సోషల్ మీడియాలో అక్కినేని అన్న పదం తొలగించినప్పటి నుంచి ఆమె వ్యవహరిస్తోన్న తీరు కూడా ఆమె చైతుకు దూరం అవుతోందన్న ప్రచారాన్ని మరింత బలపరుస్తోంది. ఇప్పటికే ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులకు అప్లై చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్టు భోగట్టా ?
ఇప్పటికే ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులకు అప్లై చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్టు భోగట్టా ? సమంత చెన్నైలో ఉంటోందట. ఇక చైతు హైదరాబాద్‌లో ఒంటరిగానే ఉంటున్నట్టు బాగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఇక సమంత హైదరబాద్ లో ఉండదని..ముంబై లో అవకాశాలు ఎక్కువుగా వస్తున్నాయని..అక్కడే ఇళ్లు కొనడానికి ప్లాన్ చేస్తుందని మీడియా కోడైకూసింది.
ఈ నేపథ్యంలో సామ్ పుకార్లకు చెక్ పెట్టేసింది. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్యాన్స్ తో కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో సామ్ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆ సమయంలోనే ఆమె అభిమాని ఒకరు “మీరు నిజంగా ముంబైకి వెళ్తున్నారా?” అని అడగ్గా..తాను ఎక్కడికీ వెళ్లనని, హైదరాబాద్ తన ఇల్లు అని సమంత క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు “ఈ పుకారు ఎక్కడ మొదలైందో నాకు నిజంగా తెలియదు. కానీ అన్ని రూమర్స్ లాగే ఇది కూడా ఒక రూమర్. ఇందులో నిజం లేదు. హైదరాబాద్ నా ఇల్లు ఎప్పటికి. హైదరాబాద్ నాకు అన్నీ ఇస్తోంది, నేను ఇక్కడే ఉంటాను” అని చెప్పి..గాసిప్ రాయళ్లు నోరు మూయించింది కోడలు పిల్ల.