Movies‘పుష్పక విమానం’ నుండి షాకింగ్ సర్ప్రైజ్..కుర్రాడు అసలు తగ్గట్లేదుగా..?

‘పుష్పక విమానం’ నుండి షాకింగ్ సర్ప్రైజ్..కుర్రాడు అసలు తగ్గట్లేదుగా..?

యువ హీరో విజయ్ దేవరకొండ కచ్చితంగా టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగాడనడంలో సందేహం లేదు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ ఎనర్జిటిక్ స్టార్. పెళ్లిచూపులు సినిమాతో సోలో హీరోగా హిట్ కొట్టి ఆ తర్వాత అర్జున్ రెడ్డి అంటూ స్టార్స్ నే సర్ ప్రైజ్ చేసిన విజయ్ ఆ తర్వాత గీతా గోవిందంతో స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు అతని తమ్ముడు ఆనంద్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్పక విమానం’ రిలీజ్‌కు రెడీ అవుతుంది. కింగ్ ఆఫ్ ది హిల్స్, టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై విజయ్ తండ్రి గోవర్ధనరావు దేవరకొండ, విజయ్, ప్రదీప్ ఎర్రబెల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దామోదర దర్శకుడు. దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాలతో యూత్ కు బాగా కనెక్ట్ అయిన ఆనంద్.. నటిస్తున్న ఈ మూడో చిత్రానికి టాలీవుడ్ లో అంచనాలు బాగానే ఉన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ‘కల్యాణం’పాట సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. పాండమిక్ వల్ల విడుదల కోసం వేచి చూసిన “పుష్పక విమానం” టీమ్ సరైన డేట్ ను ఫిక్స్ చేసుకుంది. నవంబర్ 12న సినిమా విడుదలకు ముహూర్తం నిర్ణయించింది. ” ఈ కథ మధ్యతరగతి కుటుంబాలలో వుండే డ్రామాని గుర్తుచేస్తూ , పెళ్లి చుట్టూ వుండే పరిస్థితులని చూపెడుతుందనే టాక్ సినీ వర్గాలో బలంగా వినిపిస్తుంది. మరి చూడాలి ఈ సినిమాతొ ఈ యువ హీరో అన్న లాగా బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడు ఏమో..??

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news