MoviesSai Dharam Tej Accident: ఆ మెడికల్ రిపోర్ట్ చూసాకనే ఏదైనా...

Sai Dharam Tej Accident: ఆ మెడికల్ రిపోర్ట్ చూసాకనే ఏదైనా చెప్పగలం..డాక్టర్స్ క్లారిటీ ..!!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆయనకు చాలా తీవ్ర గాయలయ్యాయి. కేబుల్ బ్రిడ్జ్, ఐకియా రూట్‌లో తన స్పోర్ట్స్ బైక్ మీదనుంచి అదుపుతప్పి క్రిందపడ్డారు సాయి తేజ్. ఈ యాక్సిడెంట్‌లో ఆయన కుడి కన్ను, ఛాతిపై బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో వెంటనే ఆయన్ను దగ్గర్లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స్ కోసం అక్కడి నుంచి అపోలో షిఫ్ట్ చేసి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.

ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో సాయి తేజ్‌కి ఫిట్స్ రాగా, వెంటనే స్పందించిన వైద్యులు అతనికి ఇంజెక్షన్లు ఇవ్వటంతో.. తదుపరి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు మెడికోవర్‌ వైద్యులు మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే. ప్రమాదానికి గురైన మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో .. సెడిషన్‌ ఇచ్చి శస్త్ర చికిత్స చేస్తున్నట్లు ఈ మేరకు అపోలో వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. శరీరం లోపల ఎలాంటి రక్తస్రావం కాలేదని స్పష్టం చేశారు. కాలర్‌ బోన్‌కు ఫ్రాక్చర్‌ కావడంతో సర్జరీ చేసే విషయంలో అపోలో వైద్యులు ఈ రోజు నిర్ణయం తీసుకోనున్నారు. సాయితేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన్న వైద్యులు.. ప్రమాదంలో శరీరం లోపల ఎలాంటి రక్తస్రావం కాలేదని ఇప్పటికే నిర్ధారించారు. వైద్య పరీక్షల ఫలితాలను పరిశీలించాక దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు డాక్టర్లు.

మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డుప్రమాదంపై మాదాపూర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీ విడుదల చేశారు. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి సమీపంలోని ఐకియా స్టోర్ వద్ద స్పోర్ట్స్ బైక్ నుంచి సాయిధరమ్‌తేజ్ కిందపడిపోయాడు. ఘటనా స్థలంలో మట్టి, ఇసుక ఉండటంతో అతడి బైక్ స్కిడ్ అయిందని పోలీసులు తెలిపారు. ఇక సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని పలువురు సినీ సెలబ్రీటీల తో పాటు ఆయన అభిమానులు సామాన్యులు కూడా కోరుకుంటున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news