Moviesపవన్ అరుదైన ఫీట్..భీమ్లా నాయక్ రికార్డుల మోత..!!

పవన్ అరుదైన ఫీట్..భీమ్లా నాయక్ రికార్డుల మోత..!!

పవర్ స్టార్ పవన్, కండల వీరుడు రానా ప్రస్తుతం అయ్యప్పనుం అనే రీమేక్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్, భీమ్లా నాయక్ అనే పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. మాస్ లో సాలిడ్ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే మాస్ లో ఈ చిత్రంకి భారీ హైప్ కూడా ఇప్పుడు నెలకొంది.

​ఈ మూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ విడుదల చేస్తూ చిత్ర యూనిట్ ట్రెండింగ్ లో ఉంచేందుకు ట్రై చేస్తోంది. ఈ చిత్రం కి సంబంధించిన టైటిల్ సాంగ్ ను చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల చేయడం జరిగింది. మాస్​ ప్రేక్షకుల్ని ఊపు ఊపేస్తోన్న ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. ఆయన లిరిక్స్​కు తమన్ మ్యూజిక్​ పెద్ద ప్లస్. “ఇరగదీసే ఇది ఫైరు సల్లగుండ, ఖాకీ డ్రెస్సు పక్కనెడితే ఈడే పెద్ద గూండా” వంటి పవర్​ఫుల్ లిరిక్స్​తో ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటోంది సోషల్ మీడియాలో ఈ పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

తాజాగా ఈ పాట అరుదైన ఫీట్ సాధించింది. టాలీవుడ్‌లో అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్ సాధించిన పాటగా ఈ సాంగ్ రికార్డు నెలకొల్పింది. ఈ విషయాన్ని తెలిపిన చిత్ర నిర్మాణ సంస్థ.. ‘భీమ్లా నాయక్’ నుంచి మరో పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసి పవన్ అభిమానులను హుషారెత్తించింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news