ఒకవైపు తెలుగులో మరోవైపు తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది లేడీ సూపర్ స్టార్ నయనతార. వయసు పెరిగే కొద్దీ నయనతార క్రేజ్ కూడా పెరుగుతోంది. సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే భామ నయనతార. గ్లామర్ రోల్స్, లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో నయనతార దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు తన సినిమాలతో వార్తల్లో నిలిచే నయనతార అప్పుడప్పుడు తన వ్యక్తిగత జీవితం వల్ల కూడా హాట్ టాపిక్ గా మారుతుంది.
శింబు, ప్రభుదేవాకు బైబై చెప్పిన తర్వాత నయనతార తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడుపుతుంది. ఇద్దరు కలిసి చెట్టా పట్టాలు వేయడం, కలిసి పండుగలు చేసుకోవడం, విహారయాత్రలకు వెళ్లి అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రియుడి దర్శకత్వంలో ప్రస్తుతం నటిస్తుంది నయనతార. విజయ్ సేతుపతి ఇందులో హీరోగా నటిస్తున్నాడు.
ప్రముఖ తమిళ దర్శకుడుతో నయనతార ప్రేమ కథకు త్వరలోనే ఒక హ్యాపీ ఎండింగ్ దొరకబోతోందని, వారిద్దరూ చాలా తొందరగా తొందరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విఘ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న నయనతార తమ ప్రేమాయణానికి ముగింపు పలికి, దాంపత్య బంధానికి స్వాగతం పలకాలని ఒక ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుందనే వార్త నెట్టింట వైరల్ గా మారింది.
క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న కేరళలోని ఓ చర్చలో ఈ జోడీ వివాహం జరగబోతుందట. ఇక పెళ్లి చాల సింపుల్ గా కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. మరి చూడాలి నయన్ పెళ్లి జీవితం ఎలా ఉంటుందో..??