అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. లవ్ స్టొరీ మొత్తంగా వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. మొదటిరోజు నుంచే అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది చైతు – సాయి పల్లవిల లవ్ స్టోరి. ఈ మూవీపై పలువురు టాలీవుడ్ సినీ తారలు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ముఖ్యంగా ‘సారంగ దరియా’ అనే పాట.. ఇప్పటికే మ్యూజికల్‌గా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న లవ్‌స్టోరి అనుకోని చిక్కుల్లోపడింది. మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో చేసే పనులు కొన్ని సార్లు పెద్ద తలనొప్పులు తెచ్చి పెడుతుంటాయి. ఇప్పుడు శేఖర్ కమ్ములకు కూడా అలాంటి పరిస్థితే ఎదురైన్నట్లు తెలుస్తుంది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలో ఓ సీన్ పై హిందు సంఘాలు మండిపడుతున్నారు.
ఈ లవ్ స్టోరీ సినిమాలోని ఓ సీన్ లో దేవుడి గదిలో మహాలక్ష్మి ఫోటో పక్కనే.. జీసస్ ఫోటో కూడా ఉంటుంది. దీని శేఖర్ కమ్ముల అన్ని మతాలు ఒక్కటే అని చెప్పడానికి ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకే చేసినట్లు అనిపించినా.. హిందూ సంఘాలు మాత్రం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందూ పూజా గదిలో జీసస్ ఫోటో ఎలా పెడతారు అంటూ ఫైర్ అవుతున్నరు. అదే పని ఒకవేళ మసీద్‌లో చేస్తే.. మీరు ఊరుకుంటారా.. అని వాళ్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యకాలంలో హిందూ దేవుళ్లను కించపరచడం పరిపాటిగా మారిపోయింది అని.. శేఖర్ కమ్ముల అలాంటి సన్నివేశాలను వెంటనే సినిమా నుండి తొలగించాలి అంటూ వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి శేఖర్ కమ్ముల ఏం చేస్తాడో..?