యంగ్ హీరో కార్తికేయ..ఆ కటౌట్ చూసే దర్శక నిర్మాతలు ఆయనకు వరుస ఆఫర్లు ఇస్తున్నారు. ఈ డైనమిక్ హీరొ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యి..మొదటి సినిమాతొనే అదరగొట్టేసారు. ఈ సినిమాలో కార్తికేయ నటనకు బడా హీరోలుకూడా మెచ్చుకున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ దగ్గర కాసులు వర్షం కురిపించడమే కాదు..కార్తికేయకు మంచి విజయం సాధించడంతో పాటు.. అందరిని మనసులను గెలుచుకుంది.
ఇక ఆ తరువాత ఈ హీరో కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అందులో భాగంగా హిప్పి , గుణ 369 , 90 ఎం ఎల్ సినిమాలో నటించాడు. కానీ వీటిలో ఏ ఒక్క సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ మధ్య కార్తికేయ నుంచి చివరగా వచ్చిన సినిమా ‘చావు కబురు చల్లగా’ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఈ హీరోని ఆచు తూచి అడుగులు వేస్తున్నాడు.
ప్రస్తుతం ఈ హీరో ప్రస్తుతం ‘రాజావిక్రమార్క’ అనే సినిమా చేస్తున్నారు. శ్రీసరిపల్లి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కాగా తాజాగా ఈ సినిమకు సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేశారు. చిత్ర బృందం. చాలా డిఫరెంట్ గా సాగిన ఈ టీజర్ లో కార్తికేయ ఎక్కువగా గన్స్ తో కనిపిస్తున్నాడు. అంతేకాదు ఫుల్ కామెడీని కూడా జోడించారు. ఇక ఈ సినిమాలో కార్తికేయ రహస్య ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్య రవిచంద్రన్ హీరోయిన్‌గా నటిస్తోంది.