Gossipsరాజమౌళి నెక్ట్స్ సినిమా ఎవరితో తీస్తున్నారో తెలిస్తే..ఎగిరి గంతేస్తారు..?

రాజమౌళి నెక్ట్స్ సినిమా ఎవరితో తీస్తున్నారో తెలిస్తే..ఎగిరి గంతేస్తారు..?

రాజమౌళి.. దర్శక బాహుబలిగా పేరు పొంది ప్రపంచ వ్యాప్తంగా క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన ఈయన తెలుగు సినిమా క్రెడిట్ ని ఎవరికి అందనమత ఆకాశానికి ఎత్తేసి ప్రపంచవ్యాప్తంగా ఒక్క బాహుబలి అనే పేరుతో సంచలనం సృష్టించిన దర్శకుడు ధీరుడు. తెలుగు సినిమా మార్కెట్ ఈ రోజు ఖండాంతరాల లో వ్యాప్తి చెందింది అంటే అది కేవలం రాజమౌళి వల్లనే అనేది జగమేరిగిన సత్యం. సినిమాలు ఎవరైనా తీస్తారు.. కానీ ప్రజలకు నచ్చే విధంగా..వాళ్ళు మెచ్చే విధంగా తీయడమే రాజమౌళి స్పెషాలిటి.

జక్కన్న సినిమా అంటే ఏ రేంజ్‌లో ఉంటుందనేది పలు సినిమాలతో నిరూపించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో జక్కన్నతో భారీ బడ్జెట్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు పలువురు బడా నిర్మాతలు. ప్రస్తుతం రాజమౌళి.. మళ్ళీ బాహుబలి రేంజ్‌లో RRR అనే సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తుండగా.. దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించి డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అన్ని కుదిరితే ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

కాగా ఇప్పుడు రాజమౌళి అభిమానులు ఆయన తదుపరి చిత్ర డీటైల్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి నెక్స్ట్ ఏ సినిమా తీయ్యబోతున్నాడు. ఏ హీరో అందులో నటిస్తున్నారు..?? అంటూ సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం..మైత్రి నిర్మాతలు రీసెంట్‌గా రాజమౌళిని మీట్ అయ్యారని.. వీరి కాంబినేషన్‌లో భారీ ప్రాజెక్టు పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నాయని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాథమిక చర్చలు మాత్రమే జరుగుతున్నాయని.. అయితే ఈ సినిమాను భారతీయ సినీ చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు చూడనంత గ్రాండ్‌గా రూపొందించాలని మైత్రి నిర్మాతలు ఫిక్సయ్యారట. మరి ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news