తాప్సీ అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితమే తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. వెంకటేష్ లాంటి పెద్ద హీరోల పక్కన అవకాశాలు వచ్చినా కూడా ఆమెకు ఎందుకో గాని స్టార్ డమ్ రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసి అక్కడ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు అంటే తాప్సీనే గుర్తుకు వస్తోంది. ‘పింక్’, ‘ముల్క్’,’బద్లా’ ‘గేమ్ ఓవర్’ సాండ్ కి ఆంఖ్ లాంటి వరుస హిట్ సినిమాలతో హిందీ పరిశ్రమలో దూసుకుపోతుంది తాప్సీ. ఇక తాప్సీ ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే మరో నాలుగైదేళ్లు ఆమె కెరీర్‌కు ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చు. ఆమె నటిస్తోన్న సినిమాలతో పాటు ఒప్పుకున్న సినిమాల లిస్ట్ చూస్తే ఐదారు వరకు ఉన్నాయి. మిగిలిన భాషల కన్నా ఆమె బాలీవుడ్లోనే బిజీబిజీగా ఉంది.
ప్రస్తుతం.. నటి తాప్సీ క్రీడా నేపథ్యంలో సాగే రెండు సినిమాల్లో ఆమె నటిస్తోంది. భారత మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ జీవిత కథ ఆధారంగా ‘శభాష్ మిథూ’, స్ప్రింటర్ రష్మి బయోపిక్‌గా ‘రష్మి రాకెట్’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇది ఇలా ఉంటే.. తాప్సీ నటనతో పాటు మరో కొత్తరంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. తాప్సీ తన ఫ్రెండ్‌తో కలిసి నిర్మాణ రంగంలోకి ప్రవేశించి ఓ సినిమా ప్రోడ్యూస్ చేసింది.. అంతేకాదు తన ప్రోడక్షన్ హౌజ్‌కు అవుట్ సైడర్స్ ఫిల్మ్స్ అనే పేరును కూడా ఖరారు చేసింది.
ఆ కొత్త ప్రొడక్షన్ కంపెనీలో తన సినిమాను మొదలుపెట్టిన తాప్సీ.. కొద్ది నెలల్లోనే ఈ మూవీ షూటింగ్‌ను కూడా పూర్తి చేసేశారు. తాజాగా ఆ మూవీ షూటింగ్ పూర్తయిందంటూ తాప్సీ చెప్పుకొచ్చారు. “మొత్తానికి సినిమా షూటింగ్ పూర్తి అయింది.. వచ్చే ఏడాది సినిమాను థియేటర్లో చూద్దాం. ఎప్పుడైనా సరే మొదటిది, తొలి అనుభవం ప్రత్యేకంగా ఉంటుంది” . తాప్సీ నిర్మాతగా మారి చేస్తోన్న మొదటి చిత్రం బ్లర్. తన బ్లర్ సినిమాను రెండు మూడు నెలల్లోనే షూటింగ్‌ను పూర్తి చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. తాప్సీ కి వర్క్ పట్ల ఉన్న డెడికేషన్..ఇంటెస్ట్ చూసి ఫిదా అవుతున్నారు.