సిద్ద్ శ్రీరామ్..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా ఆయన పాడిన పాటలే వినిపిస్తున్నాయి. అంతలా సిద్ శ్రీరామ్ పాటలకు అడిక్ట్ అయ్యిపోయారు ప్రేక్షకులు. ఇతను పాడటం వలన ఆ పాట హిట్ అవుతుందో.. లేక హిట్టయ్యే పాటలనే ఇతను ఎంచుకుని మరీ పడుతున్నాడో.. తెలియదు కానీ ఈయన పాడిన ప్రతి పాట మంచి విజయం అందుకుంటుంది. స్టార్ హీరో సినిమా అయినా, చిన్న సినిమా అయినా.. అందులో సిద్ద్ పాట ఉండాల్సిందే.
లేటెస్ట్ టాలీవుడ్ హిట్స్ అన్నీ సిద్ద్ శ్రీరామ్ సొంతం. గమ్మత్తైన గొంతు, పదాన్ని పలికే తీరులో వైవిధ్యం సిద్ద్ పాటకు ప్రత్యేకతని అలవర్చాయి. గీత గోవిందం, అల వైకుంఠపురం చిత్రాలలో సిద్ద్ పాడిన పాటలు ఆయా చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఆమధ్య విడుదలైన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిన్న చిత్రానికి సిద్ద్ శ్రీరామ్ పాట వల్ల బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది. నిజానికి చెప్పలంటే సినిమా కనా ఆ పాటే హైలెట్ గా నిలిచింది. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం అడిగి మరీ ఆయన దగ్గర పాటలు పాడించుకుంటున్నరు అని తెలిసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
తాజాగా అలాంటి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్రేజీ కాంబినేషన్ అల్లు అర్జున్ తో సుకుమార్ పుష్ప అనే సినిమా చేస్తున్న విస్యం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా టీజర్లు, ఫస్ట్‌లుక్ పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన సినిమా టీజర్ ప్రేక్షకులను అమితంగా అలరించింది. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ కోరిక మేరకు సిద్ద్ శ్రీరామ్ ఓ పాటను పాడారట. గమ్మత్తైన గొంతుతో అందరిని ఆకట్టుకున్న శ్రీరం తనదైన స్టైల్ లో ఈ పాటను కూడా పాడారట. విరిద్దరు కలిసి దిగిన ఫోటోలు పోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం బయటపడ్డిందంటున్నారు సినీ ప్రముఖులు.