ఒకప్పుడు మాస్ మహారాజ్ సినిమా అంటేనే ఫ్యాన్స్ ఈలలు,గోలలు..మాస్ స్టెప్ లు వేసుకుంటూ హాళ్ళవైపు పరుగులుపెట్టేవారు. స్క్రీన్ మీద రవితేజ హీరోయిజం తో కూడిన అల్లరి అందరిని ఫిదా చేసేది. కమెడియన్ గా .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టిన రవితేజా కెరియర్ టాప్ హీరో రేంజ్ కి రాకెట్ లా దూసుకుపోయింది. అయితే…. ఎంత వేగంగా దూసుకుపోయిందో..అంతే స్పీడ్ గా ఇప్పుడు ఆ రాకెట్ అంతే స్థాయిలో కిందికి దూసుకు వచ్చేసింది. గత కొంత కాలంగా రవితేజ నటిస్తున్న సినిమాలన్నీ బాక్సాపీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి.
అయితే మాస్ మహారాజా రవితేజ ఈ సంవత్సరం మాత్రం ఫుల్ జోష్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయినా ‘క్రాక్’ సినిమా తో రవితేజ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ ను అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన జోష్ లోనే రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖిలాడి’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా చేస్తూనే రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో కూడా రవితేజ ఒక సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.
అయితే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించబోయే సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో 20 ఏళ్ల కన్నడ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుందట. ఈమె త్వరలోనే దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న ‘పెళ్లి సందడ్’ అనే సినిమాలో హీరోయిన్గా పరిచయం అవుతోంది. అయితే ఈ టాక్ మొదలైనప్పటి నుంచి అభిమానుల్లో ‘నేల టిక్కెట్టు’ అనే సినిమా గుర్తుకు తెచ్చుకుంటున్నారు.ఈ సినిమాలో రవితేజ పక్కన హీరోయిన్ గా చేసిన మాళవిక చాలా చిన్న పిల్లలా కనిపించడంతో.. అప్పట్లో ఈ జోడీపై చాలావిమర్శలు వచ్చాయి. ఇప్పుడు శ్రీలీల హీరోయిన్ అనగానే.. మరోసారి అలాంటి విమర్శలే ఇంకా తీవ్రస్థాయిలో వస్తాయేమో అని మాస్ మహరాజా అభిమానులు ఈ పిల్ల వద్దు బాబోయ్ అంటున్నారు. దీంతో ఈ బ్యూటీ పేరు టాలీవుడ్లో ఓ రేంజ్లో మారుమ్రోగిపోతోంది.