Newsసరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన "చిట్టి నవ్వు"..లక్ష్మీ పటాస్ పేల్చేసిందిగా..!!

సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన “చిట్టి నవ్వు”..లక్ష్మీ పటాస్ పేల్చేసిందిగా..!!

‘జాతిరత్నాలు’.. ఈ సినిమా ప్రేక్షకుడి ముఖంపై చిరునవ్వుకాదు.. బాబోయ్ ఇంకొంచెం నవ్వడానికి ఓపిక ఉంటే బాగుండు అనేలా.. ఎక్కడ బోర్ కొట్టకుండా తీశాడు దర్శకుడు అనుదీప్. నవీన్ పోలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రం ‘జాతిరత్నాలు’ సినిమా టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఏ థియేటర్ చూసుకున్నా హౌల్ ఫుల్ కలెక్షన్లతో కిక్కిరిసిపోయింది.

ఇంకా చెప్పాలంటే.. లాక్ డౌన్ తర్వాత విడుదలైన అన్ని సినిమాల కలెక్షన్స్‌ను తుడిచిపెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. లాక్ డౌన్ తర్వాత ఏ సినిమా ఇంతలా కలెక్ట్ చేయలేదు. ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటోంది.పక్కా మాస్ లాంగ్వేజ్ తో, కామెడీ పంచెస్ తో మంచి కామెడీ ఎంటర్టైనర్ గా నిలిచింది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. యంగ్ డైరెక్టర్ అనుదీప్ కెవి ఈ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించారు.

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి ల కామెడీ టైమింగ్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి. ఫరియా నటన కూడా అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రం థియేట్రికల్‌గా 11 మార్చి 2021 న విడుదలై బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఈ చిత్రంలోకి “చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే” సాంగ్ అందరినీ గిర్రా గిర్రా మెలికలు తిప్పేసింది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో 10 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇదే విషయాన్ని చెబుతూ చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news