టాలీవుడ్‌లో గత కొంత కాలంగా హాట్ డిస్కర్షన్ ఏదైనా ఉందా ? అంటే అది చైతు – సమంత విడాకుల వ్యవహారమే. వార్తలు ఎలా ఉన్నా సమంత పెడుతోన్న పోస్టులు అయితే వీరి మధ్య గ్యాప్‌ను బలపరిచేలా ఉన్నాయి. సమంత తన సోషల్ మీడియాలో అక్కినేని అన్న పదం తొలగించినప్పటి నుంచి ఆమె వ్యవహరిస్తోన్న తీరు కూడా ఆమె చైతుకు దూరం అవుతోందన్న ప్రచారాన్ని మరింత బలపరుస్తోంది.
లవ్‌స్టోరీ ట్రైలర్ విషయంలో కూడా విషెస్ చెపుతూనే సమంత దానికి కేవలం హీరోయిన్ సాయిపల్లవికి మాత్రమే ట్యాగ్ చేసింది. దీనికి తోడు సమంత పెళ్లయ్యాక ఎన్ని ఫ్యామిలీ ట్రిప్పులు వేసినా, ఫ్రెండ్స్‌తో వెళ్లినా చైతు పక్కనే ఉండేవాడు. అయితే ఇప్పుడు చైతు లేకుండా కేవలం ఫ్రెండ్స్‌తో గోవా ట్రిప్‌లో పిచ్చి పిచ్చగా ఎంజాయ్ చేస్తోంది. వీరిద్దరు విడిపోతున్నారన్న వార్తలపై చైతూ కానీ, సమంత కానీ అస్సలు స్పందించలేదు.
ఇప్పటికే ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులకు అప్లై చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక చైతు లవ్‌స్టోరీ ప్రమోషన్లలో బిజీ అవుతున్నాడు. సమంత గతంలో చైతు సినిమాలను బాగా ప్రమోట్ చేసేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్టు భోగట్టా ? సమంత చెన్నైలో ఉంటోందట. ఇక చైతు హైదరాబాద్లో ఒంటరిగానే ఉంటున్నట్టు తెలుస్తోంది. వీరి గ్యాప్ ఇంతకన్నా బలమైన కారణాలు అక్కర్లేదనే ఇండస్ట్రీ వాళ్లు అంటున్నారు