బిగ్ బాస్ హౌస్‌లో వారం మొత్తంలో మంచి రంజుగా ఉండేది సోమవారంరోజే. ఎందుకంటే ఆ రోజు ఎలిమినేషన్స్‌కి నామినేషన్స్ ఉండటంతో అసలు రంగు బయటపడేది. అప్పటి వరకు దోస్త్ మేర దోస్త్ అంటూ సాగే ఫెండ్ షిప్..ఆ సమయంలో పోరా..పోవే..అన్నట్లు కోపం పీక్స్ కు వెళుతుంది. తాజాగా జరిగిన ఎపిసోడ్లో ఎవరు ఎవర్ని నామినేట్ చేశారు.. మూడో వారంలో ఎవరెవరు నామినేట్ అయ్యారు అనే ఉత్కంఠ నెలకొంది.
సోమవారం బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ ప్రక్రియ చాలా హాట్ హాట్ గా జరిగాయాయి. ఈవారం నామినేషన్స్‌లో భాగంగా ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరుచొప్పున నామినేట్ చేసి అందుకు గల కారణాలను చెప్పుతూ.. టైల్స్‌పై ఎవర్ని అయితే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ల పేర్లతో ఉన్న స్టాంప్‌ని గుద్ది.. ఆ టైల్స్‌ని సుత్తితో బద్దలు కొట్టాలని చెప్పారు బిగ్ బాస్. ఇక అక్కడి నుండి స్టార్ట్ అయ్యింది అసలు కధ.
నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా.. నటి ప్రియ లహరి యాంకర్ రవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బిగ్ బాస్ హౌస్ లో లహరి ప్రియని నామినేట్ చేస్తూ.. “నువ్వు నాతో కలిసి ఉండటం లేదు.. మనసులో ఏదో పెట్టుకుని డిస్టెన్స్ మెయిన్టైన్ చేస్తుంది అని అనడంతో ప్రియ బ్లాస్ట్ అయ్యింది. నువ్ ఎప్పుడూ మగాళ్లతోనే బిజీగా ఉంటావు.. నీకు మెన్ తప్ప ఉమెన్ అవసరం లేదు..అంటూ మాట మాట పెరిగి రవి, లహరిలు అర్ధరాత్రి బాత్ రూంలోకి హగ్ చేసుకున్నారంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టేసింది. దీంతో బిగ్ బాస్ హౌస్ లో గోడవ పెద్దది గా మారింది.
ప్రస్తుతం ఈ టాపిక్ సినీ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుండగా.. రవి భార్య నిత్య స్పందిస్తూ “నేను రవి చాలా డిఫికల్ట్ పరిస్థితుల్ని ఫేస్ చేశాం.. కానీ మా బంధాన్ని విడగొట్టలేరు. మా మధ్య చెరగని నమ్మకం మమ్మల్ని మరింత బలోపేతం చేసింది. చాలామంది ఈ ఇష్యూపై స్పందిస్తూ నాకు చాలా మెసేజ్‌లు పెడుతున్నారు. నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. నేను బాగానే ఉన్నాను. థాంక్స్ అంటూ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు రవి భార్య నిత్య.
View this post on Instagram