అక్కినేని అమల.. ఈ పేరు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు వారు ఉండరు. అమల అక్కినేని.. టాలీవుడ్ కింగ్ నాగార్జున మనసు దోచుకున్న అందాల భామ. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి కోట్లాదిమంది ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ లలో ఒకరు అమల. హలో గురు ప్రేమకోసమేరో జీవితం అనే పాటలో ఆమె చూపించిన అందం అభిమానయం ఇప్పటికి చాలామంది ఫేవరేట్ అనే చెప్పాలి.
ఇక కోడలు సమంత పై.. అమలా కొన్ని షాకింగ్ విషయాలను తెలియజేసింది. హీరోయిన్ సమంతని అక్కినేని నాగచైతన్య వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యుల్లో సమంత గురించి అమల మాట్లాడుతూ.. తన కోడలిగా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంట్లో వంట చేయలేదు అని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ విషయాలను అమల ఏం సీరియస్ గా అనలేదులేండి. సరదాగా నవ్వుతూ కోడలు పిల్ల గురించి ఆసక్తికర విషయాలను తెలియజేసింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ..నాగార్జున వంట చాలా అద్భుతంగా చేస్తాడని.. అఖిల్ ఎప్పుడూ కార్లు, బైక్స్, గేమ్ ఆడుకుంటూ ఉంటాడని చెప్పుతూ.. ఇక తమ ఫ్యామిలీ లో మొత్తం అందరూ ఎంతో అద్భుతంగా నటిస్తారని.. మెము చాలా హ్యాపిగా ఉంటామని తెలియజేసింది. ఇక సమంత గురించి చెప్పుతూ..సమంత చాలా బాగా య్స్స్క్ట్ చేస్తుందని..ఇంత్లో అందరితో బాగా కలిసిపోతుందని చెబుతూ..ఆమెని ఎప్పుడు ఏమీ అనేది కాదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇదంతా చూస్తుంటే.. వీళ్ళు అత్తకోడళ్లు లాగా లేరు మంచి ఫెండ్స్ లా ఉన్నారు అంటున్నారు నెటిజన్స్.