MoviesVIP కదా మీకేంటి ఇబ్బంది..ఆ స్టార్ హీరో పై హైకోర్ట్ సీరియస్..?

VIP కదా మీకేంటి ఇబ్బంది..ఆ స్టార్ హీరో పై హైకోర్ట్ సీరియస్..?

హీరోగా ఎదగాలి అంటే కావాల్సింది కలర్.. పర్సనాలిటీ కాదు. హీరో కావాలంటే కష్టపడ్డాలి.. క్రమశిక్షణ ఉండాలి అని నిరూపించాడు హీరో ధనుష్. కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయిన ధనుష్ చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఎన్నో కష్టాలు పడి స్టార్ హీరోగా ఎదిగి ఓ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కొలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు అయినప్పటికీ.. సొంతంగానే తన నటన టాలెంట్ ఉపయోగించి ప్రతి సినిమాకు మంచి క్రేజ్ ను పెంచుకుంటూపోతున్నాడు. ఉత్తమ నటుడిగా 2 సార్లు జాతీయ పురస్కారాలు అందుకున్న ధనుష్ నటనా టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పలు అద్భుతమైన చిత్రాలతో భారత దేశ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు.

అయితే , కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌పై మద్రాస్ హైకోర్టు సీరియస్ అయింది. హీరో ధనుష్‌కు మద్రాస్ హైకోర్టులో షాక్ తగిలింది. రోల్స్ రాయిస్ కారు కొనుగోలు ట్యాక్స్ విషయంలో ఆయన కోర్టును ఆశ్రయించారు. రోల్స్ రాయిస్ కారును భారత్‌లో దిగుమతి చేసేందుకు భారీగా సుంకం చెల్లించాల్సి ఉంటుంది. కారు ఖరీదుకంటే రెండు రెట్లు ఎక్కువగా పన్ను కట్టాలి ఉంటుంది. ఈ మేరకు మినహాయింపు కోరుతూ హైకోర్టును ధనుష్ కోరారు. దీంతో ఆయనపై కోర్టు సీరియస్ అయింది.

లగ్జరీ కారు కొనుగోలు వ్యవహారంలో పన్ను మినహాయింపు అడగడం సరికాదంటూ మొట్టికాయలు వేసింది. రోజు కూలి పనులు చేసుకునే వారు కూడా కొనుక్కునే సబ్బుకు కూడా పన్ను కడుతున్నారు. అలాంటిది మీరు ఈ స్థాయిలో ఉండి రూల్స్ ప్రకారం పన్ను కట్టడానికి అభ్యంతరం ఏమిటని జస్టిస్ ప్రశ్నించారు. సామాన్య ప్రజలే పన్ను కడుతున్నప్పుడు వీఐపీలకు మీకేంటి ఇబ్బంది? అంటూ సూటిగా ప్రశ్నించింది. చట్టం ముందు అంతా సమానులే అని పేర్కొంటూ.. పన్ను కట్టి తీరాల్సిందేనని సంచలన తీర్పునిచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news