సినీ ఇండస్ట్రీలో ప్రముఖ స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ అలాగే సూపర్ స్టార్ కృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీకి సరికొత్త టెక్నాలజీలను పరిచయం చేశాడు.ఇక వీరిద్దరూ పోటాపోటీగా సినిమాలు చేస్తూ, సినిమాల కోసం వీరిద్దరి మధ్య యుద్ధం కూడా జరిగేది. ఇక అంతే కాదు ఎన్టీఆర్ ఒక సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తే, ఆయనకు ధీటుగా మరొకరు డైరెక్టర్ తో ఇంకో సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు. కానీ ఇద్దరి కథలు ఒకే నేపధ్యంతో వచ్చేవి. అలా దాదాపుగా సినిమాల విషయంపై వీరిద్దరూ ప్రొఫెషనల్ గా కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడుకోలేదు అనే వార్తలు కూడా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి..
ఇకపోతే ఎన్టీఆర్ కు ఒక డైరెక్టర్ కథ వినిపించగా, ఆయన రిజెక్ట్ చేయడంతో ఆ డైరెక్టర్ కాస్త కృష్ణ ను సంప్రదించడం జరిగింది. అదే సినిమాను కృష్ణ తీసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ విషయాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..
సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలలో అల్లూరి సీతారామరాజు కూడా ఒకటి . ఈ సినిమా అప్పట్లోనే ఇండస్ట్రీ రికార్డ్ లను బద్దలు కొట్టి, సూపర్ స్టార్ కృష్ణకు మంచి ఇమేజ్ ను తీసుకొచ్చి పెట్టింది. ఇక ఈ సినిమాలోని పాటలు మహా అద్భుతం అని చెప్పవచ్చు. ఇక ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో కృష్ణ నటించిగా.. ఒక్క సినిమాతోనే ఈయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ సినిమాకి రామచంద్ర రావు దర్శకుడిగా వ్యవహరించాడు..
అయితే ఈయన ఎన్టీఆర్ ను ఊహించుకొని కథను సిద్ధం చేసి, ఎన్టీఆర్ కు వినిపించగా.. ఆయన కథ విని చాలా అద్భుతంగా ఉంది.. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమాలో నటించలేనని చెప్పాడట. అయితే కృష్ణ తో ఈ సినిమాని 70 శాతం వరకు పూర్తి చేశాడు రామచంద్ర రావు. ఈయన మధ్యలోనే మరణించడంతో మిగిలిన భాగాన్ని దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ తెరకెక్కించడం జరిగింది.