వెంకటేశ్..తన తండ్రి ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు నేతృత్వంలో కలియుగ పాండవులు అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కొంతమంది హీరోలలాగా తీసుకున్న కథనే మరీమరీ తీసుకుంటూ ప్రేక్షకులకు బోర్ కొట్టించేలా ఉండకుండా, విభిన్న కథలతో ఎప్పటికప్పుడు తనలో ఉన్న మేకోవర్ ను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ, సినీ ఇండస్ట్రీ లో దూసుకుపోతున్నాడు విక్టరీ వెంకటేష్. అయితే ఇప్పటికే వెంకటేష్ తన 35 సంవత్సరాల సినీ కెరీర్ ను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు. అయితే ఇంతటి సినీ ప్రస్థానంలో విక్టరీ వెంకటేష్ వదులుకున్న సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. రోజా :
ఉగ్రవాదుల నేపథ్యంలో కొనసాగే చిత్రం రోజా. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. అయితే ఈయన మొదట ఈ సినిమాను వెంకీ తో నిర్మించాలని అనుకున్నారట. కానీ వెంకటేష్ ఈ సినిమా కథను సున్నితంగా తిరస్కరించాడు.
2. ఒకే ఒక్కడు:
ఒకరోజు సీఎం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో అర్జున్ సూపర్ గా నటించారని చెప్పవచ్చు. అంతేకాదు అర్జున్ కెరియర్ నే మార్చేసింది ఈ సినిమా. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ మొదట విజయ్ ని సంప్రదించగా, అతను తిరస్కరించాడు. తర్వాత వెంకటేష్ ని అడగగా, ఈయన కూడా తిరస్కరించడంతో అర్జున్ చేతిలోకి వెళ్ళింది ఈ ప్రాజెక్టు.
3. సంతోషం :
డైరెక్టర్ దశరథ్ మొదట ఈ సినిమాను నిర్మాత సురేష్ బాబు అలాగే హీరో వెంకటేష్ తో వినిపించారు. వీరు తిరస్కరించడంతో నాగార్జున ఈ సినిమా కోసం ఏకంగా ఆరు నెలలు ఎదురు చూసి హిట్ కొట్టడం జరిగింది.
4. ఖడ్గం :
ఈ సినిమాలో మొదట శ్రీకాంత్ పాత్రలో వెంకటేష్ ని అనుకోగా, వెంకటేష్ డేట్స్ అడ్జస్ట్ కాక వదులుకున్నాడు.
5. కృష్ణం వందే జగద్గురుమ్ :
డైరెక్టర్ క్రిష్ మొదట వెంకటేష్ తో ఈ సినిమా చేయాలనుకున్నాడు. ఇక బాబాయి తప్పుకోవడంతో అబ్బాయి రానా చేసి హిట్ కొట్టాడు.
6. గోవిందుడు అందరివాడేలే :
ఇక ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ కు బాబాయ్ పాత్రలో వెంకటేష్ ను అనుకున్నారు . కానీ వెంకటేష్ ఈ సినిమాను చేయనని చెప్పేశాడట.
7. క్రాక్ :
దర్శకుడు గోపీచంద్ మలినేని బాలకృష్ణను దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాస్తే , ఆయన ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత వెంకటేష్ కి చెప్పగా అతను కూడా తిరస్కరించడంతో, ఈ సినిమాను రవితేజ చేసి సూపర్ హిట్ కొట్టాడు.
8. ఆడవాళ్లు మీకు జోహార్లు:
దర్శకుడు కిషోర్ తిరుమల , శర్వానంద్ కంటే ముందుగానే విక్టరీ వెంకటేష్ ని కలవడం జరిగింది. ఆయన ఈ సినిమాను ఒప్పుకోకపోవడంతో ,శర్వానంద్ చేతిలోకి వెళ్ళింది ఈ సినిమా.