మెగా కోడలు.. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యంగ్ ఎంటర్‌ప్రెన్యూయర్‌గా సత్తా చాటుతూ అపోలో లైఫ్ విభాగం వైస్ ఛైర్మన్‌గా కొనసాగుతున్న ఉపాసన.. నిత్యం పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరి చేత భేష్ అనిపించుకుంటోంది. ముఖ్యంగా ఆమె చేసే సామాజిక సేవలకు ఎందో అభిమానులు ఉన్నారు. కష్టం ఉందంటే చాలు.. వారికి సహాయం అందించేందుకు ఉపాసన ఎప్పుడు ముందుంటారు. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే ఈ ఉపాసన..ఎప్పటికప్పుడు ఆమె విషయాలు తన అభిమానులకి చెబుతూంటారు.
ప్రస్తుతం RRR Team ఉక్రెయిన్ లో ఉంటున్న సంగతి తెలిసందే. ఇక రామ్ చరణ్‌తో కలిసి ఉక్రెయిన్ షెడ్యూల్ కోసం ఆర్ఆర్ఆర్ టీంతో కలిసి వెళ్లిపోయారు ఉపాసన. మొత్తానికి రామ్ చరణ్‌తో పాటుగా ఆర్ఆర్ఆర్ సెట్స్ మీద ఉపాసన బాగా సందడి చేసి.. భర్తను ఒంటరిగా వదిలేసి హైదరబాద్ కు పయనమైనట్లు తెలుస్తోంది.
నిజానికి ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇంకొన్ని రోజులు ఉంది.. కానీ ఇక్కడ ఉపాసన కు అర్జెంట్ పని పడి..త్వరగా ఇండియాకు వచ్చేసిన్నత్లు తెలుస్తుంది. అయితే ఆర్ఆర్ఆర్ టీం కు , రాజమౌళి ఫ్యామిలీకి ఉపాసన థ్యాంక్స్ చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ మంచిగా ఫినిష్ చేసుకుని ఇండియాకు రండి అంటూ ఆ పోస్ట్ లో పేర్కోంది.