కృష్ణవంశీ.. ఓ డైనమిక్ డైరెక్టర్. టాలీవుడ్ కి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించాడు. క్రియేట్ సినిమాలకు పెట్టింది పేరు అయిన కృష్ణవంశీ చేసింది తక్కువ సినిమాలే అయినా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కృష్ణవంశీ సినిమాలు అన్ని క్రియేటివిటీ గా ఉంటాయి. కానీ చందమామ సినిమా తర్వాత కృష్ణవంశీ చెప్పుకోదగ్గ సినిమా ఏమీ చేయలేదు. అయితే ఏమైందో ఏమో కానీ..ఆయన చాలా సినిమాలు చేసిన అవన్నీ ఎప్పుడు వచ్చాయో..ఎప్పుడు వెళ్లిపోయాయో కూడా తెలియలేదు.
అయితే కృష్ణవంశీ టోటల్ సినీ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ ఒకటి ఉంది. ఆ మూవీ అందర్కి నచ్చకపోవచ్చు.. కానీ.. కొందర్కి ఆ మూవి అంటే పడి చచ్చిపోతారు. ఇప్పటికి ఆ మూవీ టీ విలో వచ్చిన .. అసలు మిస్ కాకుండా చూస్తారు. ఆ సినిమానే “అంతఃపురం”. సీనియర్ హీరో సాయి కుమార్, సౌందర్య జంటగా నటించిన అంతఃపురం సినిమాలో ప్రకాష్ రాజ్, హీరో జగపతి బాబు కీలక పాత్రలలో నటించారు.
తెలుగులో ఇప్పటికే బోలెడు ఫ్యాక్షన్ సినిమాలు వచ్చాయి. కానీ ఏ సినిమా కూడా ఈ సినిమాను బీట్ చెయ్యలేకపోయింది. 1998లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల పై అలాంటి ముద్ర వేసుకుంది. ఇక ఈ సినిమాకి మరోక ప్లస్ పాయింట్ మ్యూజిక్. ఇళయరాజా అందించిన మ్యూజిక్ ఓ అద్భుతం. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో అసలేం గుర్తుకు రాదు నా కన్నుళ్ల ముందర నువ్వు ఉండగా..ఈ పాట ఇప్పటికీ ప్రతి ఒక్కరి ప్లే లిస్ట్ లో ఉంటుందనడంలో ఆశ్చర్యంలేదు. ఈ సినిమా ఎంత హిట్ అయ్యిందంటే.. హాలీవుడ్ వాళ్ళు కూడా ఈ సినిమాని కాపీ కోట్టేసారు. సేం టు సేం అంతపురం సినిమా లాగే ఇంగ్లీష్ లో బ్లడ్ డైమండ్ అనే సినిమా తీసారు. ఈ రెండు సినిమాలకు చాలా పోలికలు ఉన్నాయి. ఇక అలా మొత్తం సినిమాను కాపీ చేసి ఆ డైరెక్టర్ అడ్డంగా దొరికిపోయారు .
.