పవన్ కళ్యాణ్.. ఆ పేరులోనే ఓ పవర్ ఉంది. ఆ పేరు చెబుతుంటేనే ఆయన అభిమానులు పూనకాలు వచ్చిన్నట్లు ఊగిపోతుంటారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పవన్..టాలీవుడ్ కి ఎన్నో భారి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు. అన్న స్టార్ హీరో అయినంత మాత్రాన తమ్ముడు కూడా స్టార్ హీరో అవ్వాలంటే ఈ రంగుల ప్రపంచంలో కుదరదు. మనకంటూ ఓ టాలెంట్.. ఏదైన సాధించాలనే కృషి.. పట్టుదల ఉండాలి.. అప్పుడే మనం మనదారిలో పూర్తిగా సక్సెస్ అవ్వగలం. అందుకు ప్రత్యేక నిదర్శనం “పవన్”. సినీ నటుడిగా పవన్ కల్యాణ్ స్టార్ డమ్ ఏంటన్నది అందరికీ తెలిసిందే. అందరికన్నా భిన్నంగా సాగిపోయే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే.. ఎవ్వరికైనా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది.
పేరుకి చిరంజీవి తమ్ముడే అయినా.. ఆయన ఏనాడు ఆ పేరు వాడుకోలేదు.. తన కష్టంతో..తన నటనతో..మంచి సినిమాలను ఎంపిక చేసుకుని..ట్రెండ్ ఫాలో అవ్వకుండా..ట్రెండ్ సెట్ చేసుకున్నాడు పవన్. అందుకే ఆయనకు కోట్లల్లో అభిమానులు ఉంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు చెబుతుంటేనే వాళ్ళకు పూనకాలు వచ్చేస్తాయి.. నిజానికి పవన్ కల్యాణ్ ని వాళ్ల అభిమానులు ఓ హీరోగా చూడరు.. దేవుడిగా ఆరాధిస్తారు. పవన్ అంటే పిచ్చి ప్రేమ వాళ్లకి. ఇక పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. పవన్ ని అభిమానిస్తే పూజిస్తారు.. అదే ఆయన జోలికి వచ్చి తిక్క తిక్క గా మాట్లాడితే.. ఆ తిక్కలకి లెక్కలు చెప్పుతారు.
జనరల్ గా పవన్ కి అభిమానులు ఎక్కువగా ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. కానీ, తాజాగా పాకిస్తాన్ లో కూడా పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. పాక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటూ ఓ ట్విట్టర్ ఖాతా ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా అంతా షాకయ్యారు. అలాగే ఆ ప్రొఫైల్ పిక్ చూసి ఆశ్చర్యపోయారు. పైగా ఇక మేము ట్విట్టర్‌లో ఎంటర్ అయ్యాం అంటూ వాళ్ళు పెట్టిన ట్యాగ్ లైన్ చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ ఖాతా ఎక్కడినుంచి ఓపెన్ అయింది అనే దానిపై పోలీసులు కన్నేశారు. వాళ్ళు పెట్టిన ట్వీట్‌ని సైబర్ క్రైం విభాగానికి ట్యాగ్ చేశారు. దీంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. పవన్ స్టార్ డమ్ దేశ సరిహద్దులు దాటిపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ.. పాకిస్తాన్ పేరుతో అభిమాన సంఘం ఏర్పాటు కావడమే హాట్ టాపిక్ గా మారింది.