Moviesఉలిక్కిపడ్డిన సినీపరిశ్రమ..ఆ స్టార్ హీరో చెల్లెలికి చేతబడి..ఎందుకో తెలిస్తే షాక్ అయిపోతారు..?

ఉలిక్కిపడ్డిన సినీపరిశ్రమ..ఆ స్టార్ హీరో చెల్లెలికి చేతబడి..ఎందుకో తెలిస్తే షాక్ అయిపోతారు..?

హీరోయిన్ “మోహిని”.. బహుశా ఈ పేరు చెప్పగానే..ఎవరబ్బా ఈ హీరోయిన్.. అని చాలా మంది అనుకుంటుంటారు..చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు కూడా.. అదే మన నటసింహం నందమూరి బాలకృష్ణ క్లాసిక్ మూవీ ‘ఆదిత్య 369′ హీరోయిన్‌ అని చెప్పితే టక్కున గుర్తుపట్టేస్తారు. యస్..’ఆదిత్య 369’ మూవీలో బాలయ పక్కన హీరోయిన్‌ గా చేసిందే.. ఆమె పేరే మోహిని.

‘ఆదిత్య 369’ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో హీరోయిన్ మోహినికి కూడా మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈమె హిట్లర్ మూవీ లో చిరంజీవికి చెల్లెలిగా కూడా నటించారు . ఈమె ఆ తర్వాత తెలుగులో మోహన్ బాబు హీరోగా వచ్చిన ‘డిటెక్టివ్‌ నారద’లో కూడా నటించింది.

ఒక్క తెలుగు భాష లోనే కాకుండా మలయాళం తమిళ సినిమాలలో కూడా నటించిన ఇమె..దాదాపు 100పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. అంతేకాకుండా ఈమె కొన్ని కోట్ల మంది హిందువులకు గురువు అయిన రమణ మహర్షికి వరుసకు మనవరాలు అవుతుంది. అయితే తన సినీ కెరీర్ గురించిన ముచ్చట్లను చెబుతూ తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు మోహిని. ఇక ఆ ఇంటర్వ్యుల్లో ఆమె తన విషయాలను ఓపెన్ గా చెప్పెసింది. తన జీవితంలో మలుపులెన్నో ఉన్నాయని.. ఒకానొక సమయంలో ఆమెకు చేతబడి కూడా చేశారని చెప్పుకొచ్చారు.

ఆ ఇంటర్వ్యుల్లో మోహిని మాట్లాడుతూ.. “పెళ్ళైన ఐదేళ్లకు అనేక మానసిక సమస్యలు ఎదురయ్యాయని, రెండుసార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేశానని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నానో తనకే తెలిసేది కాదని, చివరకు ఓ జ్యోతిష్కుడికి చూపించగా చేతబడి చేశారని ఆయన చెప్పినట్లుగా” మోహిని తెలిపారు.

అనేక పూజలు వ్రతాలు ప్రార్థనలు చేసిన తరువాత ఏసుప్రభు తనని కాపాడారు అని… ఆ తర్వాత తన మానసిక సమస్యల నుంచి బయట పడ్డాను అంటూ చెప్పుకొచ్చింది మోహిని. ఇంకా..ఈమె మాట్లాడుతూ మచి అవకాశాలు వస్తే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడతానంటుంది ఈ బాలయ్య భామ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news