మొదట సమంత గా తన నటనతో, అందంతో అందరిని మెప్పించిన ఈ అమ్మడు.. ఆతరువాత అక్కినేని ఇంటి కోడలుగా అందరి మనసుల్లో మంచి స్దానాని సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే..అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టిన సమంత.. పెళ్లి తరువాత సెలెక్టివ్ సినిమాలు చేసుకుంటూ వస్తుంది.
ఈ అక్కినేని కోడలు సినిమాలు ఒక్కటే కాదండోయ్.. వ్యాపారాలు, ఫ్యాషన్ ఇలా అన్నింటా నేనే నెం.1 అంటూ ముందన్నట్లుగా హవా నడిపిస్తోంది కోడలు పిల్ల. మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాత తనకు నచ్చినట్లుగా ఉంటూ అక్కినేని కోడలి రూటే సపరేటు అనిపించుకుంటోంది. ఫ్రీ టైం దొరికిన ప్రతిసారి భర్త నాగ చైతన్యతో రొమాంటిక్ టూర్స్ వేస్తూ ఉంటుంది.అంతేనా.. ఆయా ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయడం సమంత హ్యాబీ.
ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. అక్కినేని కోడలు పిల్ల సమంత బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిందట. యాంకర్ మీరు లాస్ట్ గా సోషల్ మీడియాలో డైరెక్ట్ మెసేజ్ చేసిన సెలెబ్రిటీ ఎవరు అని ప్రశ్నించగా.. అప్పుడు సమంత అనుష్క శర్మ పేరు చెప్పిందట .అనుష్క శర్మ తన ఇంస్టాగ్రామ్ స్టోరీకి రియాక్ట్ అవుతూ మెసేజ్ చేయడంతో సమంత అస్సలు నమ్మలేకపోయిందట. “ఏంటి.. నాకు అనుష్క శర్మ మెసేజ్ చేసిందా..?? అని ఆశ్చర్యపోయిందట”.
ఇక ఈ సందర్భంగా సమంత అనుష్క శర్మ గురించి మాట్లాడుతూ ఆమెపై ప్రశంసలు కురిపించిందట. అనుష్క శర్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందరిలో చైతన్యం కలిగించే పోస్ట్ లు పెడుతూ అందరిలో ఉత్సాహం నింపుతారని…అనుష్క శర్మ సందేశాలు చాలా విలువైనవని సమంత చెప్పుకొచ్చారట.