Gossipsఆ వ్యాఖ్యలను ఎడిటింగ్ లో తీసేయ్యండి.. ఎన్టీఆర్ స్ట్రిక్ట్ వార్నింగ్..??

ఆ వ్యాఖ్యలను ఎడిటింగ్ లో తీసేయ్యండి.. ఎన్టీఆర్ స్ట్రిక్ట్ వార్నింగ్..??

బాలీవుడ్ మెగా‌స్టార్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యహారిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి షోకు ఎంతో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. కేబీసీ షో బిగిన్ అయితే చాలు.. టీవీలకు ప్రేక్షకులు అతుకుపోతారు.బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన కౌన్ బనేగా కరోడ్ పతి టీవీ షోకు దేశవ్యాప్తంగా గొప్ప ప్రజాదరణ రావడంతో.. దీన్ని తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో ప్రసారం చేసారు. ఇప్పటి వరకు తెలుగులో నాలుగు సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి.

ఇక ఇప్పుడు ఈ షో త్వరలో జెమినీ లో ప్రసారం కాబోతుంది. అయితే, ఇప్పుడు ఈసారి హోస్ట్ గా ఐదో సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నారు.బిగ్ బాస్ సీజన్ 1 హోస్ట్ చేసి బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈసారి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అంటూ సందడి చేయబోతున్నారు. ఎన్టీఆర్ ఈసారి మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తుండటంతో ఈ షో కోసం కోట్లాదిమంది అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెమినీ టీవీలో ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కార్యక్రమం ప్రారంభం కానుంది. నిజానికి మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. కానీ కరోనా రెండో దశ కారణంగా ఆగిపోయింది. కరోనా తగ్గుతున్న నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఐదో సీజన్‌కి సంబంధించి తాజాగా ప్రోమో వీడియో రిలీజ్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది. ఎన్టీఆర్ మాటల తూటాలు బుల్లితెర ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇందులో తారక్ మీసకట్టు లుక్ స్పెషల్ అట్రాక్షన్ అయింది.

ఎన్టీఆర్ హోస్టింగ్ లో ఇప్పటికే ఓ స్పెషల్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. ఇక ఈ సోలో మొదతి గెశ్ట్ గా “RRR” కో స్టార్ రామ్ చరణ్ వచ్చారని టాక్. ఇందులో తారక్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పిన చరణ్.. 25 లక్షల దాకా గెలుచుకున్న విషయం మీడియాకు లీకైంది. అంతేకాదు.. సరదాగా సాగిన ఈ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ పోలిటికల్ ఎంట్రీ పై కూడా మాట్లాడారట.

‘నువ్వు రాజకీయాల్లోకి వెళ్తున్నావట కదా? అని ఎన్టీఆర్ ను చరణ్ ప్రశ్నించగా… అప్పుడు తరక్.. పొలిటికల్ ఎంట్రీ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడని… అయితే దీన్ని టెలికాట్ చేయద్దు.. ఎడిటింగ్ లో తీసేయండని షో నిర్వాహకులకు ఎన్టీఆర్ స్ట్రిక్ట్ గా చెప్పారట. సో.. దీని బట్టి అక్కడ తారక్ ఏం తన రాజకీయ ఎంట్రీ పై ఏం చెప్పాడొ చూడలేం. తారక్ ఏమి చెప్పాడో చరణ్ కు అక్కడున్న వారికి ఆడియన్స్ కి మాత్రమే తెలుసు.. అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిచ్ది. అసలు ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించే చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ..యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తే టిఆర్పి రేటింగ్ కుమ్మేయడం ఖాయం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news