Moviesబన్నీ ఎన్ని కోట్లకు వారసుడో తెలుసా..ఎవరు గెస్ చేయలేరు..?

బన్నీ ఎన్ని కోట్లకు వారసుడో తెలుసా..ఎవరు గెస్ చేయలేరు..?

ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాలకు సైన్‌ చేస్తూ.. మోస్ట్ బిజీఎస్ట్ స్టార్‌గా అందరిచేత పిలిపించుకుంటున్నారు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ బన్నీ. పాన్‌ ఇండియా సినిమాల దగ్గర నుంచి పక్క ఇండస్ట్రీల డైరెక్టర్ల వరకు అన్నింటికి, అందరికీ ఫస్ట్ చాయిస్గా మారి అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నారు. ప్రస్తుతం పాన్‌ ఇండియ మూవీ “పుష్ఫ” సినిమాలో నటిస్తున్న బన్నీ.. ఆ తరవాత వరుసగా డైరెక్టర్లను లైన్లో పెట్టి మరో 2 సంవత్సరాలు డేట్లు ఖాళీలేనంతగా బిజీగా మారిపోయారు.

మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు వారి అబ్బాయి అల్లు అర్జున్ తనకంటూ సొంత ఇమేజ్ తో స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయకుడుగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘గంగోత్రి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. కెరీర్ మొదట్లోనే అగ్రదర్శకులతో కలిసి పనిచేసే అవకాశం సంపాదించుకున్నాడు. దాదాపు 18 ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్న అల్లు అర్జున్ వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసి ఎన్నో విజయాలను తన కతాలో వేసుకున్నాడు. చిత్ర పరిశ్రమలో ఎన్నో అవార్డులు సొంతం తన చేసుకున్నాడు.

అయితే ఇటీవల హిట్ కొట్టిన అలవైకుంఠపురంలో మూవీకి ఏకంగా 36కోట్లు అందుకున్నాడని టాక్ . అలాగే ప్రస్తుతం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పాన్ ఇండియా సినిమా పుష్ప సినిమాకు 40 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఒక్క సినిమాకు 45 కోట్ల వరకూ పారితోషికం తీసుకునే అల్లు అర్జున్ కి దాదాపుగా నాలుగు వందల కోట్ల వరకు ఆస్తి ఉంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్డునెంబర్ 45లో 15కోట్ల విలువచేసే అధునాతన సౌకర్యాలతో ఇల్లు .. 8కార్లు,అన్ని సౌకర్యాలతో ఏడున్నర కోట్ల విలువ చేసే కార్వాన్ ఉన్నాయి.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news