ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ సీనియర్లలో టాప్ హీరో నందమూరి బాలకృష్ణ. అలాగే తెలుగులో నటవారసుల్లో టాప్ హీరో అనిపించుకున్న తొలి హీరో కూడా. లెజెండ్ నందమూరి తారకరామారాము కడుపున పుట్టి, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు నట సింహం బాలకృష్ణ. ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బోయపాటి – బాలయ్య కాంబో అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అఖండ సైతం వీరి కాంబోలో ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడుతుందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే అఖండకు అదిరిపోయే బిజినెస్ జరుగుతోంది. సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్‌తో వస్తోన్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
ఇక ఇప్పటికే 100 కు పైగా సినిమాలో నటించిన బాలకృష్ణ ఇటు సినీ రంగలోను.. అటు రాజకీయాల్లోను దూసుకుపోతున్నాడు. . అయితే ఆయన నటించిన సినిమాల్లో చాలా వరకు ఆల్ మోస్ట్ అన్ని హిట్ సాధించాయి.కానీ ఆయన నటించిన ఓ సినిమా మాత్రం ప్లాప్ అవుతుందని బాలయ్యకి ముందే తెలుసట. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? ‘తిరగబడ్డ తెలుగు బిడ్డ’ అనే సినిమా. తిరగబడ్డ తెలుగుబిడ్డ 1988 లో వచ్చిన యాక్షన్ చిత్రం. తేజస్వి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నందమూరి హరికృష్ణ నిర్మించగా, ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, భానుప్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.
ఈ సినిమా కథ ఆయనకు ఏమాత్రం నచ్చలేదట. అయినప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ కు ఈ కథ నచ్చడం తో ఒప్పుకున్నారట బాలకృష్ణ. తండ్రి మాట కాదనకూడదని కథ నచ్చకపోయిన కూడా ఒప్పుకుని ఈ సినిమా చేసారట. ఇక ఒకానొక టైంలో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు.. ఒక సీన్ తెరకెక్కిస్తున్న టైం లో మరో టేక్ తీసుకుందాం అని డైరెక్టర్ అడిగితే బాలయ్యకు కోపం వచ్చి..” ఫ్లాప్ అయ్యే సినిమాకు మరో టేక్ ఎందుకు” అని కసిరారట.