సింగర్ చిన్మయి శ్రీపాద.. తమిళ రైటర్ వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలతో మీటూ ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొన్న సంగతి తెలిసిందే. కేవలం సింగర్ గానే కాకుండా సామాజిక అంశాలపై గళం ఎత్తుతూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు సింగర్ చిన్మయి. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతూ.. సంచలన విషయాలతో హాట్ టాపిక్ అయ్యారు సింగర్ చిన్మయి. సోషల్ మీడియాలో ఎప్పూడు యాక్టివ్‌గా వుండే ఈ సింగర్ తనదైన స్టైల్‌లో ఆడపిల్లలపై జరుగుతున్న లైంగింక వేధింపులను అడ్రెస్ చేస్తూ అవసరమున్నవారికి అండగా ఉంటోంది.
తాజాగా చిన్మయి లక్నో గర్ల్ ఘటన మీద స్పందించడంతో వివాదం మొదలైంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ యువతి నడి రోడ్డు మీద క్యాబ్ డ్రైవర్‌ను దారుణంగా కొట్టిన వీడియో దేశం మొత్తాన్ని కదిలించింది. ఈ ఘటన మీడియానే షేక్ చేసేస్తుంది. దీనిపై చిన్మయి స్పందించారు.. ఆ అమ్మాయి అలా ప్రవర్తించి ఉండకూడదని.. ఇలా ఎవ్వరు చేసినా తప్పే.. అని చెప్పుకొచ్చారు.
అయితే, అసలు మ్యాటర్ ఇక్కడే స్టార్ట్ అయ్యింది. చిన్మయి మొత్తం ఇంగ్లీషులోనే మాట్లాడింది. కానీ కొందరు ఇంగ్లీష్ తెలియని ఆకతాయిలు.. ఆమె ఏం మాట్లాడుతుందో తెలియక.. జనరల్ గా చిన్మయి ఆడవాళ్ళకేగా సపోర్ట్ చేస్తుందని..అనుకొని..చిన్మయి మీద ట్రోల్స్ స్టార్ట్ చేసారు. పిచ్చి పిచ్చి వేషాలు వేసారు. చిన్మయి ఊరుకుంటుందా.. అసలు తగ్గెదేలే.. అంటూ లైవ్ లోకి వచ్చి ట్రోలర్స్ దుమ్ము దులిపేసింది.
చిన్మయి మాట్లాడుతూ..” అసలు నేను పెట్టిన పోస్ట్ ఏంటో కూడా చూడకుండా.. నాకు అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారు. వారి పురుషాంగం ఫోటోలను నాకు పంపుతున్నారు. మీ అంగాలు భాగున్నాయనే ఉద్దేశ్యంతో నాకు పంపుతున్నారా..?? ఆ అంగాల మీద నాకు ఎలాంటి ఇంట్రస్ట్ లేదు.. అమ్మాయిలు మీరు పెళ్లి చేసుకునేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.. ఇలాంటి ఇడియట్స్ కూడా ఉంటారు జాగ్రత” అని సలహా ఇచ్చారు.
View this post on Instagram