MoviesRRR కోసం జీవితంలో NTR ఫస్ట్ టైం అలా చేసాడట..!!

RRR కోసం జీవితంలో NTR ఫస్ట్ టైం అలా చేసాడట..!!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న “RRR” సినిమా కోసం యావత్ టాలీవుడ్ ఆడియెన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ఈ సినిమా కోసం తెలుగు ఆడియెన్స్‌తో పాటు ఇతర భాషల ఆడియెన్స్ కూడా చాలా ఆశగా చూస్తున్నారు. పాన్ ఇండియా కేటగిరిలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్లు సినిమా పై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. గత మూడేళ్ళుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం RRR టీం చివరి షెడ్యూల్ కోసం రాజమౌళి తన బృందాన్ని ఉక్రెయిన్‌కు తీసుకెళ్లారు. అక్కడే చివరి షెడ్యూల్‌ను భారీ ఎత్తున ప్లాన్ చేసేశారు. ఈ సందర్భంగా సెట్ లో తారక్ మెడలో ఐడీ కార్డ్ వేసుకొని ఫోటోకి ఫోజు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఫోటోలో జూనియ‌ర్ ఎన్టీఆర్ మెడ‌లో ఓ ట్యాగ్ .. ఆ ట్యాగ్ కు ఉన్న ఐడీ కార్డులో నంద‌మూరి తార‌క‌రామారావు అని పేరుండ‌గా..హోదా స్థానంలో యాక్ట‌ర్ అని ఉంది. తార‌క్ బ్లాక్ టీ ష‌ర్ట్‌, బ్యాగ్ తో స్లైలిష్ గా ట్యాగ్ వేసుకుని నిల‌బ‌డ‌గా..ప‌క్క‌నే జ‌క్క‌న్న కూడా త‌న మెడ‌లో ఉన్న ట్యాగ్ ను చూపిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ లో జూనియ‌ర్ ఎన్టీఆర్ కొమ్రం భీం గా క‌నిపించ‌బోతున్నాడు. సీత పాత్రలో బాలీవుడ్ న‌టి అలియా భ‌ట్ న‌టిస్తోంది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో జాతీయ స్థాయి తారలు నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news