టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి 2003లో దిల్ సినిమాతో నిర్మాతగా మారారు. ఈ రోజు ఇండస్ట్రీని శాసించే వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. డిస్ట్రిబ్యూషన్, నిర్మాతగా, ఎగ్జిబిటర్, థియేటర్ల సిండికేట్‌లో ఒక కీలక వ్యక్తిగా ఆయన చక్రం తిప్పుతారన్న టాక్ అయితే ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. రాజు ప్లానింగ్ మామూలుగా ఉండదు. కొన్ని సంవత్సరాలుగా ఆయన హవా నడుస్తోంది. పెద్ద హీరోలు, దర్శకులతో క్రేజీ కాంబినేషన్లు సెట్ చేయడం ఆయనకే చెల్లింది.
బడా బడా ప్రాజెక్టులను మంచి నీళ్లు తాగినంత సులువుగా సెట్ చేసి పడేస్తారు. టాలీవుడ్లో అగ్ర నిర్మాత దిల్ రాజు ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఆయన లెక్కలు వేరేగానే ఉంటాయి. టాలీవుడ్ లో సరైన కథలను ఎంపిక చేసుకోవటంలో గాని…. సినిమా ఫలితాలను ముందుగా అంచనా వేసి డిస్ట్రిబ్యూషన్ చేయడంలోగాని దిల్ రాజుకు దిల్ రాజే సాటి అన్న పేరు ఉంది.
దిల్ రాజు ఓ మంచి కథను ఎంచుకొని సరైన డైరెక్టర్‌తో సినిమా చేస్తే.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టవచ్చు అన్న విషయం గతంలో చాలాసార్లు రుజువయ్యింది. ఇక దిల్ రాజు ఒక సినిమాను పంపిణీ చేస్తున్నాడు అంటే… ఆ సినిమా రిలీజ్‌కు ముందే సగం హిట్ అన్న టాక్ ఇండస్ట్రీలో ఉండేది. ఇండస్ట్రీపై రాజుకు అంత ఖచ్చితమైన గురి ఉండేది. అయితే, ఓ సినిమ్మ మత్రం ఆయన లెక్కలను తలకిందులు చేసింది. అనుకున్నంత హిట్ కాదు కదా.. అట్టర్ ఫ్లాప్ అనే టాక్ ను సొంతం చేసుకుంది ఆ సినిమా. ఇంతకి ఆ సినిమా ఏంటో తెలుసా..??”.. ‘శ్రీనివాస కళ్యాణం’
తానేం చేసినా ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే చేస్తానంటూ ఎప్పుడూ గర్వంగా చెప్పుకునే నిర్మాత దిల్ రాజు.. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ తీసిన ‘శ్రీనివాస కళ్యాణం’ దిల్ రాజు కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. మామూలుగా శతమానం భవతి హిట్ అయింది కాబట్టి.. అదే ఫ్లేవర్ లో ఈ కళ్యాణం కూడా జరిపించేద్దాం అనుకున్న అతని ప్లాన్ బెడిసికొట్టింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోకంటే .. ఓవర్శీస్ లో దిల్ రాజు సినిమా పరిస్థితి మరీ ఘోరంగా మారింది. మామూలుగా దిల్ రాజు సినిమాలకు ఓవర్శీస్ లో మంచి కలెక్షన్ప్ ఉంటాయి.కానీ శ్రీనివాస కళ్యాణం విషయంలో ఇది పూర్తిగా రివర్స్ అయింది. మొత్తంగా తను ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీసిన సినిమా అని చెప్పుకున్న శ్రీనివాస కళ్యాణం దిల్ రాజు కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ రెండో రోజుకే ఏ థియేటర్ లోనూ 30శాతం కూడా నిండలేదు.. దీన్నిబట్టి శ్రీనివాస కళ్యాణం ఎంత అట్టర్ ఫ్లాప్ అయ్యిందో మన అర్ధం చేసుకోవచ్చు.