Moviesధన్ రాజ్ ఎమోషనల్..ఆ బాలీవుడ్ బ్యూటీ ఊహించని కామెంట్స్....??

ధన్ రాజ్ ఎమోషనల్..ఆ బాలీవుడ్ బ్యూటీ ఊహించని కామెంట్స్….??

తెలుగు బుల్లితెరపై ‘జబర్ధస్త్’ కార్యక్రమంలో బాగా పాపులర్ అయిన నటుడు ధన్ రాజ్. తర్వాత వెండితెరపై అడుగు పెట్టాడు. బిగ్ బాస్ 1 లో కనిపించి సందడి చేశాడు. బుల్లి తెర ఆర్టిస్ట్‌గా ప‌రిచ‌య‌మై ఇప్పుడు వెండి తెర క‌మెడియ‌న్‌గా కెరియ‌ర్‌ని కొన‌సాగిస్తున్న వారిలో ధ‌న్‌రాజ్ ఒక‌రు. సినిమాల్లో న‌టిస్తూ ప్ర‌స్తుతం మంచి మంచి అవ‌కాశాల‌ను అందుకుంటూ మంచి రేంజ్‌లో ఉన్నాడ‌నే చెప్పాలి.

బుల్లితెర, వెండితెరపై ధన్ రాజ్‌కు మంచి ఫాలోయింగ్ఉంది. అలాంటి ధన్ రాజ్, సునీల్ కలిసి హీరోలుగా ఓ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పోస్టర్లు నెట్టింట్లో బాగానే వైరల్ అయ్యాయి. బుజ్జీ ఇలారా అనే ఈ సినిమాపై సోషల్ మీడియాలో మంచి హైప్ ఉంది. సునీల్‍, ధన్‍రాజ్‍, చాందిని తమిళరాసన్‍ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం బుజ్జీ ఇలారా… సైకలాజికల్‍ థ్రిల్లర్‍ ఉపశీర్షిక. గరుడవేగ అంజి దర్శకుడు. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మాతలు. దర్శకుడు జి.నాగేశ్వ రెడ్డి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‍ప్లేను సమకూర్చుతున్నారు.

ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఈ మూవీకి సంబంధించి వచ్చిన పోస్టర్‌లో ధన్ రాజ్ లుక్‌ను రివీల్ చేసేశారు. సీఐ కేశవ్‌నాయుడు అనే పోలీస్‌ అధికారిగా ధన్‌రాజ్‌ కనిపించనున్నారు. అయితే ధన్ రాజ్ పాత్రకు సంబంధించిన లుక్ మీద నోరా ఫతేహీ అదేనందీ.. బాహుబలిలో ఇరుక్కుపో హత్తుకుని వీరా వీరా అంటూ మత్తెక్కించిందే ఓ భామ..ఆమె నోరా ఫతేహీ.. ధన్ రాజ్ సినిమాపై స్పందిస్తూ.. “ఇతనే సీఐ కేశవ్ నాయుడు అలియాస్ ధన్ రాజ్.. బుజ్జి ఇలారా అనే సినిమా నుంచి అదిరిపోయే ఫస్ట్ లుక్. ఆల్ ది బెస్ట్ ధనా” అని బెస్ట్ విషెస్ అందించారు. ఇక నోరా ఫతేహీ స్పందించడంపై ధన్ రాజ్ ఎమోషనల్ అవుతూ.. ఈ రోజు ఇది ప్రత్యేకమని ధన్ రాజ్ చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news