Gossipsబన్నీ కి భారీ షాక్..పుష్ప నుండి 47 నిమిషాల సినిమా లీక్..??

బన్నీ కి భారీ షాక్..పుష్ప నుండి 47 నిమిషాల సినిమా లీక్..??

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ పుష్ప. పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాష‌ల్లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా కనిపించనున్నారు. శేషాచ‌లం అడ‌వుల్లోని గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ ఉంటుంద‌ని తెలుస్తోంది. బ‌న్నీ – సుకుమార్ కాంబినేష‌న్లో వ‌స్తోన్న పుష్ప‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్ ,పుష్ప సినిమా ఫస్ట్ సింగిల్ దాక్కో దాక్కో మేక .. పాట యూట్యూబ్ ని షేక్ చేసింది. అలా దాక్కో దాక్కో మేక అనే పాట ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. అయితే , ఇటీవల పాన్ ఇండియా ప్రాజెక్టుగా వస్తున్న ‘పుష్ప’ మూవీ నుంచి కొన్ని పిక్స్, పాట ముందే బయటకు వచ్చేశాయి. ఇక ఆ తరువాత ఫైట్ సీన లీకఒంది. ​ఇక లీకైన వీడియో ఆధారంగా చూస్తుంటే భారీ యాక్షన్ సీక్వెన్స్ లా కన్పిస్తోంది. ఎడిటింగ్ టేబుల్ లేదా రీ-రికార్డింగ్ టేబుల్ నుండి వీడియో లీక్ అయినట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు మాత్రం పుష్పకు పెద్ద దెబ్బే పడ్డట్టు కనిపిస్తోంది. పుష్ప నుంచి ఓ సాంగ్.. దాదాపు 47 నిమిషాల సినిమా బయటకు వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.ఇక సోషల్ మీడియాలో #Pushpa Leaked అనే హ్యాష్ ట్యాగ్ మీద కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ లీకులపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. శ్రీవల్లి అనే పాట మొత్తం లీకైందని అంటున్నారు. ఇప్పుడు సినిమా యూనిట్ కి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news