Moviesసినీ ఇండస్ట్రీ అంటే అస్సలు ఇష్టం లేని అమల..ఈ రంగంలోకి రావడానికి...

సినీ ఇండస్ట్రీ అంటే అస్సలు ఇష్టం లేని అమల..ఈ రంగంలోకి రావడానికి కారణం ఆయనే..?

అక్కినేని అమల.. ఈ పేరు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు వారు ఉండరు. అమల అక్కినేని.. టాలీవుడ్ కింగ్ నాగార్జున మనసు దోచుకున్న అందాల భామ. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి కోట్లాదిమంది ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ లలో ఒకరు అమల. హలో గురు ప్రేమకోసమేరో జీవితం అనే పాటలో ఆమె చూపించిన అందం అభిమానయం ఇప్పటికి చాలామంది ఫేవరేట్ అనే చెప్పాలి.

ఇక అమల అక్కినేని గురించి మాత్రమే చాలా మందికి తెలుసు. పెళ్లికి ముందు అమల గురించి చాలా తక్కువ మందికే తెలుసుంటాది. అమల 1968, సెప్టెంబర్ 12న కోల్‌కతాలో జన్మించారు. అమల వాళ్ళ తండ్రి పేరు ముఖర్జీ..ఈయన ఓ బెంగాలీ. ఈయన నేవీ ఆఫీసర్ గా పనిచేసాడు. ఇక తల్లి విషయానికి వస్తే ఐర్లాండ్ దేశానికి చెందిన మహిళ. అమల తండ్రి ముఖర్జీది ప్రేమ వివాహం. ఆ తర్వాత ముఖర్జీ ఖరగ్పూర్ లో ప్రొఫెసర్ గా కూడా పనిచేసారు.

అయితే అమలాకు సినీ ఇండస్ట్రీ వైపు రావడం అస్సలు ఇష్టం లేదట. కానీ ఆమె చదువుకునే వయసులో ఆమె నాట్యం చూసి టి . రాజేంద్ర ప్రసాద్ ఆమెను సినిమాల్లోకి ఆహ్వానించారట. అయితే అమల అందుకు ఒప్పుకోలేదట. ఆమె చదువు పూర్తి అయిన తర్వాతనే సినిమాల్లోకి నటించడానికి వస్తాను అని తేల్చి చెప్పిందట.

ఇక ఆ తరువాత..టి. రాజేందర్ దర్శకత్వం వహించిన మిథిలి ఎన్నై కాథాలి అనే సినిమాతో సినీ ఇండస్ట్రీ లో అడుగు పెట్టి.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బారి విజయాన్ని సాధించింది. ఒక రాత్రి లోనే ఫేమస్ అయిపోయింది సినీ ప్రేక్షకులను విపరీతంగా అక్కటుకున్నారు . తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం కన్నడ హిందీ భాషలలో కూడా ఆమె ఆమె హీరోయిన్ గా నటించి సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అమల మొత్తం 54 సినిమాల్లో నటించారు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news