దక్షిణాది లేడి సూపర్‌స్టార్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర ఏదైనా సరే అందులో ఆమె ఒదిగిపోతారు. నీలాంబరి, శివగామి ఇలా కొన్ని పాత్రలు ఆమె కోసమే పుట్టాయా.? అన్నట్లుగా కీర్తిని ఘడించారు. నీలాంబరిగా మారినా.. శివగామిగా రాజ్యాన్ని పాలించినా.. దేవతగా అవతారం ఎత్తినా.. రమ్యకృష్ణకే చెల్లింది. 1992 నుంచి 2000 వరకు పలు భాషల్లో తన అసమాన ప్రతిభతో ఓ వెలుగు వెలిగింది రమ్యకృష్ణ కే.రాఘవేంద్రరావు చిత్రాలకు కేరాఫ్ రమ్యకృష్ణ అనేంతగా ఆయన దర్శకత్వంలో సూపర్‌హిట్ సినిమాలు చేసింది.
ఆ సమయంలో కుర్రకారుకు రమ్యకృష్ణ స్వప్న సుందరి. తన హాట్ అందాలతో ఓ ఊపు ఊపేసింది తెలుగు వారిని. ఆ తర్వాత తల్లి, వదిన.. పలు పాత్రల్లో నటించినా, బాహుబలి చిత్రాల్లో ‘శివగామి’ పాత్ర ఆమె నటనా కౌశలాన్ని ఖండాంతరాలకు విస్తరింపజేసింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున అక్కినేని, రమ్యకృష్ణలది సూపర్ జోడి. వీళ్లిద్దరు కలిసి దాదాపు 9 సినిమాల్లో కలిసి నటించారు. వయసు మీద పడటంతో హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా రూపాంతరం చెందింది రమ్య. ప్రస్తుతం ఆమె పలు చిత్రాల్లో నటిస్తున్నారు.
కెరీర్ మొదట్లో గ్లామరస్ రోల్స్ చేసి యువతను ఆకట్టుకుంది రమ్యకృష్ణ. తన కెరీర్ ను ఓ రేంజిలో టర్న్ తిప్పిన సినిమా రజనీకాంత్ హీరోగా చేసిన నరసింహ. ఈ చిత్రంలో నీలాంబరి అనే నెగెటివ్ రోల్ చేసి ఓ రేంజిలో నటించింది. ఆమె క్యారెక్టర్ ను జనాలు ఇప్పటికీ మర్చిపోలేదని చెప్పుకోవచ్చు.
రమ్య కృష్ణ కెరీర్ చెప్పుకోదగ్గ సినిమాలు ఏవంటే బాహుబలితో పాటు నరసింహ సినిమా కూడా వెంటనే గుర్తొస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేసిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓ సరికొత్త రికార్డులు బ్రేక్ చేసింది. లేడి విలన్ గా నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ చూపించిన హావభావాలు ట్రెండ్ సెట్ చేశాయి. ఓ విధంగా బాహుబలి కంటే ఎక్కువ రేంజ్ లో రమ్యకృష్ణకు గుర్తింపు దక్కింది.
అయితే అంతగా పేరు తెచ్చి పెట్టిన పాత్ర అమ్మడికి ఏ మాత్రం ఇష్టం ఉండదట. మొదట దర్శకుడు కెఎస్. రవికుమార్ సౌందర్య పాత్ర కావాలా? అని అడిగితే వెంటనే ఎగిరి గంతేసి ఒప్పేసుకునేదాన్ని కానీ దర్శకుడు నీలాంబరి పాత్రకి నువ్ కరెక్ట్ గా సరిపోతావని ఒత్తిడి చేయడం తప్పుకుందట.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమారంగాల్లో అద్భుతంగా రాణించింది రమ్య. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులతో కలిసి చెన్నైలో ఉంటుంది. సినిమా దర్శకుడు కృష్ణవంశీని 2003లో పెళ్లి చేసుకుంది. వీరికి రిత్విక్ వంశీ అనే అబ్బాయి ఉన్నాడు.