Moviesరోజా చేసిన హాలీవుడ్ సినిమా తెలుసా..!

రోజా చేసిన హాలీవుడ్ సినిమా తెలుసా..!

మ‌న తెలుగు సినిమాల్లో చాలా సీన్లు హాలీవుడ్‌లో ప‌లు సినిమాల నుంచి స్ఫూర్తి పొంది తీసిన‌వి ఉంటాయి. టాప్ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కూడా కొన్ని ఇత‌ర భాష‌ల సినిమాల్లోని సీన్ల‌ను కాపీ కొట్టేశార‌ని చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉంటాయి. ఇక బోయ‌పాటి శ్రీను ప‌లు యాక్ష‌న్ సీన్ల‌ను కూడా ఇత‌ర భాష‌ల‌కు చెందిన సినిమాల్లో నుంచి లేపేస్తుంటార‌ని చెపుతూ ఉంటారు. ఇలా సీన్ల‌ను ఎత్తేసి కాపీ కొట్టేయ‌డం ప్రీమేక్ అంటూ ఉంటారు. మ‌న న‌గ‌రి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సైతం హాలీవుడ్ సీన్ల‌తో కాపీ కొట్టిన ఓ ఫ్రీమేక్ సినిమాలో న‌టించింది.

పైగా ఈ సినిమా ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు రోజా భ‌ర్త ఆర్కే సెల్వ‌మ‌ణి. 1995లో రోజా స్టార్ హీరోయిన్‌గా ఉన్న స‌మ‌యంలో తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో అసుర‌న్ అనే సినిమాలో న‌టించారు. అప్ప‌ట్లో నాలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను గ‌డ‌గ‌డ లాడించిన గంధ‌పు చెక్క‌ల దొంగ స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ క‌థ‌కు హాలీవుడ్ హిట్ మూవీ ప్రిడేట‌ర్‌ను క‌లిపి అసుర‌న్ తెర‌కెక్కించారు. ఈ సినిమాలో హీరో అరుణ్ పాండ్య‌న్ కాగా… హీరోయిన్ రోజా..!

ప్రిడేట‌ర్ సినిమాలో ఆర్నాల్డ్ హీరో.. అప్ప‌టికే ఆర్నాల్డ్‌కు కండ‌ల వీరుడు అన్న పేరు ఉంది. ఇక్క‌డ ఆరుణ్ పాండ్య‌న్ సైతం అదే దేహ‌ధారుడ్యంతో ఉండేవారు. ఈ క్ర‌మంలోనే అరుణ్ పాండ్య‌న్‌ను హీరోగా పెట్టి సెల్వ‌మ‌ణి ఈ సినిమా తీయాల‌ని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాకు సెల్వ‌మ‌ణి ద‌ర్శ‌కుడే కాదు… నిర్మాత కూడా..! ఈ సినిమా అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది..! అలా రోజా డైరెక్టుగా హాలీవుడ్ సినిమా చేయ‌క‌పోయినా ప‌రోక్షంగా హాలీవుడ్ సీన్ల‌ను కాపీ చేసిన సినిమాలో న‌టించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news