టాలీవుడ్ కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే ఈయనకు ఫాలోయింగ్ కూడా ఒక రేంజ్ లో ఉంది. అయితే మొదట విలన్ అవుదామని సినీ సినీ ఇండస్ట్రీకి వచ్చి కమెడీయన్ అయ్యాడు. కమెడియన్ గా మొదలుపెట్టి తర్వాత చిన్న గా హీరోగా మారాడు. అయితే ఒకవైపు కమెడియన్ గా, మరొక వైపు హీరోగా నటిస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు.
చిత్రం సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయిన సునీల్.. నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి సినిమాలతో స్టార్ కమెడియన్ అయ్యాడు. అప్పట్లో ఏడాదికి దాదాపు 20 సినిమాలకు పైగానే నటించాడు. నందితో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నాడు. సినిమాల పరంగా సునీల్ లైఫ్ తెరిచిన పుస్తకమే కానీ పర్సనల్ లైఫ్ పరంగా మాత్రం ఈయన గురించి ఎవరికీ తెలియదు.
సునీల్ పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా ఎవరికీ తెలీదు సినిమాల్లోకి రాక ముందు భీమవరంలో ఉండేవాడు. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలోనే సునీల్ పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఈయన భార్య గురించి కానీ.. కుటుంబం గురించి కానీ చాలా మందికి ఐడియా లేదు. కేవలం 5 సంవత్సరాల వయస్సులోనే తండ్రిని కోల్పోయాడు సునీల్. అప్పట్నుంచి అమ్మ లాలనలోనే పెరిగాడు సునీల్.
సునీల్ భార్య పేరు శృతి ఇందుకూరి. ఈమె ఫోటోలు కూడా పెద్దగా కనిపించవు సునీల్ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు సునీల్ ఫ్యామిలీ పెద్దగా బయటకు కనబడదు 45 ఏళ్ల సునీల్ కి ఒక పాప ఒక బాబు ఉన్నారు. ఇక ఇప్పటికి కూడా సినిమాల్లో అదే ఊపుతో ముందుకు వెళుతున్నాడు సునీల్.