కష్టపడితే మనిషి మహోన్నత స్థానానికి ఎదుతాడనే దానికి నిలువెత్తు నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి. 1979లో ప్రాణం ఖరీదు చిత్రంతో కెరీర్ ను స్టార్ట్ చేసిన చిరు తన సినీ కెరీర్ లో అనేక ఎత్తు పల్లాలను, సవాళ్లను ఎదుర్కొని ఈరోజు మెగాస్టార్ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. తన మెగా హిట్స్ తో తెలుగు సినిమా స్టామినా పెంచిన మెగాస్టార్ బాక్సాఫీస్ కింగ్ గా వెలిగారు.
మెగా ఫ్యామిలీకి మూలమైన చిరంజీవి.. సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి సపోర్ట్ లేకుండానే వచ్చారు. మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటున్న సమయంలోనే ప్రముఖ సీనియర్ కమెడియన్ అల్లు రామలింగయ్య తన కుమార్తెసురేఖను చిరంజీవికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి అయిన వేళా విశేషమో ఏమో కానీ.. క్రమంగా చిరంజీవికి ఎక్కువ సినిమాలు రావడం.. క్రమంగా ఆయన హీరోగా నిలదొక్కుకోవడం జరిగాయి.
కెరీర్ ప్రారంభంలో ‘మన వూరి పాండవులు’ సినిమాలో చిరంజీవి ఐదుగురు కుర్రాళ్లలో ఒకరిగా నటించాడు. ఆ సినిమాలో విలన్ రావుగోపాలరావు మేనల్లుడు పాత్రలో చిరంజీవి నటిస్తే.. విలన్ అసిస్టెంట్ కనెక్షన్ కనకయ్య పాత్రలో అల్లు రామలింగయ్య నటించారు. ఆ సినిమాలో చిరంజీవి నటనను బాగా గమనించిన అల్లు రామలింగయ్య, తన గుణగణాలను కూడా గమనించ సాగారు. ఎందుకంటే తొలి పరిచయంలోనే చిరంజీవి ఆయనకుమంచి అభిప్రాయం ఏర్పడింది. తన కుమార్తె సురేఖను ఇచ్చి పెళ్లి చేస్తే బావుంటుంది కదా, అనే ఆలోచన వచ్చింది. దాంతో చిరంజీవిని దగ్గరగా గమనించసాగారు రామలింగయ్య.
ప్రాణం ఖరీదు చిత్రం తర్వాత మనవూరి పాండవులు, తాయరమ్మ బంగారయ్య, ఇది కథ కాదు, శ్రీరామ బంటు, కోతల రాయుడు, పున్నమినాగు, మొగుడు కావాలి, న్యాయం కావాలి, చట్టానికి కళ్ళులేవు, కిరాయి రౌడీలు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, పట్నం వచ్చిన పతివ్రతలు, బిల్లా రంగా, పల్లెటూరి మొనగాడు, అభిలాష, గూఢచారి నెం.1, మగమహారాజు వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. ఖైదీ చిత్రం సాధించిన సక్సెస్ చిరుని స్టార్ గా మార్చేసింది. సుప్రీమ్ హీరో అయ్యారు.
చిరంజీవికి, అల్లు రామలింగయ్యకి కామన్ ఫ్రెండ్ అయిన జయకృష్ణగారిని అరవింద్ కలుసుకుని అసలు విషయం చెప్పాడట. అప్పుడు జయకృష్ణ సరేనని చెప్పి, రెండు కుటుంబాల వారిని పిలిచి పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడట. అయితే సురేఖ చిరంజీవిని.. తయారమ్మ బంగారయ్య శతదినోత్సవ వేడుకల్లో మొదటి సారి చూసిందట. ఇక ఈ జంట పెళ్లి చేసుకుని హ్యాపిగా ఉంది. వీళ్లకి ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లలందరికి పెళ్లిలు అయిపోయాయి. అందరూ హ్యాపీగా ఉన్నారు.