Moviesఅంతా చేసేసి సిస్టర్ అంటాడు.. చాలా షాకయ్య..ఓపెన్ అప్ అయిపోయిన సదా..!!

అంతా చేసేసి సిస్టర్ అంటాడు.. చాలా షాకయ్య..ఓపెన్ అప్ అయిపోయిన సదా..!!

సదా..ఈ పేరు గురించి దక్షిణాది ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన ‘జయం’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది హాట్ బ్యూటీ సదా. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ పలు సౌత్ ఇండియన్ భాషల్లో బాగా ఫేమస్ హీరోయిన్ అయింది.

జయం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అందరినీ ఆకట్టుకున్నారు. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో తనదైన ఆకట్టుకున్న హీరోయిన్ ’సదా’. ‘జయం’తో టాలీవుడ్‌కి పరిచయమైన ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 40కు పైగా చిత్రాల్లో నటించారు.

తమిళంలో శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన ‘అపరిచితుడు’ సినిమా కథానాయికగా సదాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. సదా కెరీర్‌లో ‘జయం’తో పాటు ‘అపరిచితుడు’ సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. నిజానికి సినిమా షూటింగ్ టైములో హీరో, హీరోయిన్లు ఫ్రెండ్లీగా ఉంటారన్న సంగతి తెలిసిందే.

ఏమైనా రొమాంటిక్ సీన్లలో పాల్గొనాలి అంటే.. కనీసం వీళ్ళ మధ్య కొంచెమైనా చనువు ఉండాలి. అయితే ‘అపరిచితుడు’ షూటింగ్ టైములో.. హీరో విక్రమ్ మాత్రం సీన్స్ చేసేసి.. హీరోయిన్ సదాని సిస్టర్ అని పిలిచేవాడట. సదా కూడా అదేవిధంగా విక్రమ్ తో మసులుకునేదట. ఈ విషయం శంకర్ కు తెలిసి షాక్ అయ్యాడట. మిమ్మల్ని సినిమాలో సీతారాములు లా చూపిస్తుంటే.. ‘మీరు బయట మాత్రం ఇలా బెహేవ్ చేస్తున్నారా? ఈ విషయం మీడియాకి లీకైతే నా సినిమా సంగతేంటి?’ అంటూ ఆయన ఫన్నీగా రియాక్ట్ అయ్యారని సదా చెప్పుకొచ్చింది.

తెలుగులో ఈ భామ‘నాగ’లో ఎన్టీఆర్ సరసన నటించింది. మరోవైపు బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరభద్ర’లో కథానాయికగా యాక్ట్ చేసింది. తాజాగా అలీతో సరదాగా షోలోకి గెస్ట్‌గా వచ్చిన సదా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను అందరి ముందు బయటపెట్టేశారు. అంతేకాదు సీనియర్ హీరో బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ లపై షాకింగ్ కామెంట్స్ చేసారు.

జూనియర్ ఎన్టీఆర్ లా డ్యాన్స్ చేసేవారిని తాను ఇంతవరకు చూడలేదని, ఎంత పెద్ద మూవ్ మెంట్స్ అయినా ఆయన ఇచ్చి ఒకేసారి చూసి టేక్ చేస్తారని రిహార్సల్ చేయకుండా అలా చేయడం ఎలా సాధ్యమో తనకు అర్థం కాదని సదా చెప్పుకొచ్చారు. వర్క్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కు మక్కువ ఎక్కువని సదా వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ చాలా సిన్సియర్ అని డెడికేటెడ్ అని సదా పేర్కొన్నారు.

ఇక బాలకృష్ణ గారు విషయానికి వస్తే..ఆయనతో కలిసి వీరభద్ర సినిమాలో హీరోయిన్ గా నటించాను.ఆయన మనస్తత్వం మొత్తం చిన్న పిల్లల లాగే ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా ఎంతో ఆక్టివ్ గా ఎనర్జిటిక్ గా ఉంటూ అందరికీ మంచి స్నేహితుడి లాగా వుంటాడు అని చెప్పుకొచ్చింది..ప్రస్తుతం ఈ భామకు సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో పలు రియాలిటీ షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news