Moviesవారెవ్వా.. వాట్ ఏన్ ఐడియా తాప్సీ.. ఈమెను చూసి నేర్చుకోండిరా అయ్యా..!!

వారెవ్వా.. వాట్ ఏన్ ఐడియా తాప్సీ.. ఈమెను చూసి నేర్చుకోండిరా అయ్యా..!!

తాప్సీ.. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సొట్ట బుగ్గల సుందరి. దిల్లీ ముద్దుగుమ్మ తాప్సీ… ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో ఆమె ఎక్కువగా బాలీవుడ్‌ చిత్రాలకే పరిమితమవుతోంది. ప్రస్తుతం.. నటి తాప్సీ క్రీడా నేపథ్యంలో సాగే రెండు సినిమాల్లో ఆమె నటిస్తోంది. భారత మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ జీవిత కథ ఆధారంగా ‘శభాష్‌ మిథూ’, స్ప్రింటర్‌ రష్మి బయోపిక్‌గా ‘రష్మి రాకెట్‌’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

‘పింక్’, ‘ముల్క్’,’బద్లా’ ‘గేమ్ ఓవర్’ సాండ్ కి ఆంఖ్ లాంటి వరుస హిట్ సినిమాలతో హిందీ పరిశ్రమలో దూసుకుపోతుంది తాప్సీ. ఇది ఇలా ఉంటే.. తాప్సీ నటనతో పాటు మరో కొత్తరంగంలోకి అడుగు పెడుతోంది. తాప్సీ తన ఫ్రెండ్‌తో కలిసి నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తోంది. అంతేకాదు తన ప్రోడక్షన్ హౌజ్‌కు అవుట్ సైడర్స్ ఫిల్మ్స్ అనే పేరును కూడా ఖరారు చేసింది.

దీనికి సంబంధించిన పేరును, లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ.. ఇకపై నటిగానే కాకుండా నిర్మాతగా కొత్త మార్గం వైపు అడుగులు వేస్తున్నా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని..జీ స్టూడియోస్‌తో కలిసి ‘బ్లర్‌’ అనే సినిమాను నిర్మించబోతున్నానని, ఇందులో తాను లీడ్ క్యారెక్టర్‌ చేయనున్నానని, అజయ్‌ బెహల్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారని అన్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇక్కడ నిలదొక్కుకోవాలనుకునే పట్టుదల ఉన్న వారికి మా ప్రొడక్షన్‌ హౌస్‌ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయని తాప్సీ చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news