తెలుగు బుల్లితెర పాపులర్ షో బిగ్‌బాస్ ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో ఐదో సీజన్‌కు రెడీ అవుతోంది. తెలుగు బుల్లితెర పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ 5వ సీజన్ ప్రారంభించేందుకు తెరవెనక సన్నాహాలు జరుగుతున్నాయి. ఆగస్టులో షో స్టార్ట్ అవుతుందని… ఈ సారి కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే బిగ్‌బాస్ కోసం అదిరిపోయే సెట్ వేస్తున్నారని తెలుస్తోంది. ఈ పనులు కూడా మొదలయ్యాయట.
అసలు ఈ బిగ్‌బాస్‌లోకి ఎవరెవరు వస్తారు ? అన్నదానిపై ఇప్పటికే రకరకాల చర్చలు స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా నాలుగో సీజన్ తర్వాత బిగ్‌బాస్‌లోకి వెళ్లిన వారికి మంచి పాపులారిటీ వస్తుండడంతో ఐదో సీజన్లోకి వెళ్లేందుకు బుల్లితెర సెలబ్రిటీలు, సినిమాల్లో అవుట్ డేటెడ్ అయిన వాళ్లు చాలా మంది ఉత్సాహంతో ఉన్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ ఐదో సీజన్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు మీడియం రేంజ్ యాంకర్లు, చిన్నా చితకా యాంకర్లే కాదు టాప్ యాంకర్లు సైతం తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారట.
ఇదిలాఉంటే ఈ సీజన్‌లో కంటెస్టెంట్ ఎవరన్న ఆసక్తి అందర్లోనూ ఉండగా.. అనేక పేర్లు సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ రొమాంటిక్ జంటను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపుతున్నట్టు సమాచారం. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న శ్రీహాన్-సిరి హనుమంత్ జంటను బిగ్ బాస్ హౌస్‌కి పంపించబోతున్నారనేది లేటెస్ట్ అప్డేట్.
యాంకర్‌గా పలు ఛానల్స్‌లో పనిచేసిన సిరి హన్మంత్ ఉయ్యాల జంపాలా సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టింది. మోహిని, అగ్నిసాక్షి సీరియల్స్‌తో పాపులర్ అయ్యింది. సిరి గత కొన్నేళ్లుగా శ్రీహాన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉంది. అయితే శ్రీహాన్-సిరి హనుమంత్ ఎప్పటి నుంచో ప్రేమలో ఉండగా.. త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. శ్రీహాన్-సిరి హనుమంత్ జంటను పెళ్లికాకముందే బిగ్ బాస్ హౌస్‌లోకి పంపుతున్నట్టు సమాచారం.