Moviesసినిమా హిట్.. నిర్మాత ఫట్.. ఆ దర్శకుడిని నిండా ముంచేసిన మహేష్...

సినిమా హిట్.. నిర్మాత ఫట్.. ఆ దర్శకుడిని నిండా ముంచేసిన మహేష్ బాబు..!!

ఏదైనా ఒక సినిమా ఒకసారి చూస్తారు.. రెండు సార్లు చూస్తారు.. లేదా ఓ నాలుగైదు సార్లు చూస్తారు. కానీ, ఆ సినిమాని మాత్రం పదిహేనేళ్ళ నుంచి ఎన్నిసార్లు టీవీలో ప్రసారం చేసినా.. ఇప్పటికీ జనం చూస్తూనే ఉన్నారు. ఆ సినిమాని ఎన్నిసార్లు చూసావు అని ఎవరినైనా అడిగితె వాళ్ళు ఇచ్చే సమాధానం లెక్కలేనన్ని సార్లు! అని వస్తుంది. అది త్రివిక్రముడు సెల్యులాయిడ్ రాజకుమారుడితో చేసిన మేజిక్! అదే అతడు సినిమా..అతడు

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2005లో విడుదల అయిన ఒక తెలుగు సినిమా. ఇందులో హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు. నటించాడు. త్రిష కథానాయికగా నటించింది. డి. కిషోర్, ఎం. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించగా జయభేరి ఆర్ట్స్ పతాకంపై మురళీ మోహన్ సమర్పకుడిగా వ్యవహరించాడు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు.

జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా 2005లో ప్రేక్షకుల ముందు వచ్చి అతి పెద్ద విజయాన్ని అందుకుని, దర్శకుడిగా త్రివిక్రమ్ కి మరింత పేరు తెచ్చిపెట్టింది. మురారి సినిమా తర్వాత మళ్ళీ ఫ్యామిలీ కథలను ఎప్పుడు టచ్ చేయలేదు మహేష్.. కానీ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ఈ అతడు సినిమా 2005 ఆగస్టు 10 న విడుదలై అని వర్గాల ప్రేక్షకులను మెప్పించి మంచి విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఎక్కువ డీవీడీలు అమ్ముడు పోయిన సినిమా కూడా అతడునే .. అందుకు గాను ఉత్తమ డివిడి అవార్డును అందుకుంది ఈ చిత్రం.

ఈ సినిమాను నిర్మించింది సీనియర్ నటుడు అలాగే రాజకీయ నేత అని మురళీమోహన్. మురళీమోహన్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన జయభేరి ఆర్ట్స్ పతాకంపై అతడు సినిమాని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ మొదలు అవకముందు అనుకున్న బడ్జెట్ వేరు. కానీ ఈ సినిమా పూర్తయ్యే సరికి అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్ అయ్యింది. ఇక ఈ సినిమా ద్వారా హీరోకి , హీరోయిన్ కి , దర్శకుడికి, విలన్ కు ఇలా అందరికీ మంచి పేరు తీసుకొచ్చింది. కానీ నిర్మాత మాత్రం పూర్తిగా నష్టపోయాడు. వెండితెరపై కంటే బుల్లితెర పైన ఎక్కువ ప్రభంజనం సృష్టించింది ఈ చిత్రం.

ఈ సినిమా 3 నంది పురస్కారాలు,, ఉత్తమ దర్శకుడి విభాగంలో దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారం గెలుచుకుంది. ఇది తమిళంలో నందు అనే పేరుతో, మలయాళంలో టార్గెట్ అనే పేరుతో అనువాదం అయింది. హిందీలో ఏక్ అనే పేరుతోనూ, బెంగాలీలో వాంటెడ్ పేరుతో పునర్మించారు. పోలండ్ లో Poszukiwany అనువాదం అయ్యి పోలండ్ లో విడుదలైన మొదటి తెలుగు సినిమాగా గుర్తింపు పొందింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news