తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి తిరుగులేని టాప్ స్టార్ హీరో గా ఎదిగిన వాడు ఎవరు అంటే ఎవరైనా మెగాస్టార్ చిరంజీవి గారి పేరు చెప్పొచ్చు.తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. చిన్న క్యారక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని ప్రారంభించి అంచలంచలుగా ఎదుగుతూ హీరో స్థాయికి చేరి ఎన్నో బ్లాక్ బస్టర్ మరియు ఇండస్ట్రీ హిట్స్ కొట్టి మెగాస్టార్ అయినా చిరంజీవి ప్రయాణం ప్రతి ఒక్కరికి ఒక్క పాఠం లాంటిది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.
వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తనదైన శైలీలో సినిమాలు చేస్తూ నేటి యువ హీరోలకు ఆదర్శంగా నిలిచారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమా ఒప్పుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ సినిమా ఒప్పుకుంటారు. ఇక మెగాస్టార్ సినీ పరిశ్రమకు కొంత విరామం ఇచ్చిన మళ్ళి సినిమాలో దూసుకెళ్తున్నారు. చిరంజీవి సెకండ్ సినీ ఇన్సింగ్ కూడా సూపర్ డూపర్ గా దూసుకెళ్తుంది. చిరంజీవి ఇప్పటివరకు 151 సినిమాల్లో నటించాడు.
చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి రాకముందు స్టేజి పైన నాటకాలను వేసేవారు అనే సంగతి మనకు తెలిసిందే. ఇక చిరంజీవి అప్పట్లో దూరదర్శన్ ఛానల్ లో ప్రసారమయ్యే”రజిని ” అనే హిందీ నాటిక లో నటించడం జరిగింది. అది కూడా కేవలం ఒకే ఒక్క ఎపిసోడ్ లో గెస్ట్ గా చేశారు. ఈ విషయం ఇప్పటికీ తమ అభిమానులకు ఎవరికీ తెలియదు. అలా చిరంజీవి బుల్లితెరపై కూడా అప్పట్లోనే నటించాడని చెప్పవచ్చు. అలా మెగాస్టార్ బుల్లితెర అరంగేట్రం కూడా ఆరోజుల్లోనే జరిగిపోయింది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి ప్రాజెక్ట్‌లను రెడీ చేశారు. ఆచార్య షూటింగ్ పూర్తవ్వడంతోనే వెంటనే లూసిఫర్ రీమేక్‌ను మొదలుపెట్టేందుకు రెడీగా ఉన్నారు. ఆ తరువాత వేదాళం రీమేక్‌ను మెహర్ రమేష్ సిద్దం చేశారు. అటుపై బాబీ దర్శకత్వంలో మరో చిత్రం ఉండబోతోంది. ఇలా మొత్తానికి మంచి లైనప్ పెట్టేశారు.