మురారి.. మహేష్ బాబు కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ. మహేష్ బాబు ఇంకొక వంద సినిమాలు తీసిన కూడా ఈ సినిమాకి ఆయన కేరీర్ లో ప్రత్యేక స్థానం ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ తన కెరియర్ లో రాజకుమారుడు తర్వాత మహేష్ కు సూపర్ హిట్ ఇచ్చిన సినిమా మురారి. కృష్ణవంశీ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ కెరియర్ లో చాలా స్పెషల్ మూవీ అని చెప్పొచ్చు.
మురారి పాత్రలో మహేష్ నటన అద్భుతం. మురారి సినిమాలో మహేష్ నటనకు స్పెషల్ జ్యూరీ నంది అవార్డ్ వచ్చింది. కమర్షియల్ గా కూడా మహేష్ ఖాతాలో మొదటి బంపర్ హిట్ ఇదే . ఈ సినిమాతో మహేష్ కు ఫ్యామిలీ ఆడియెన్స్ ఫాలోయింగ్ పెరిగింది. మురారి సినిమాలో మహేష్ నటనకు లేడీ ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు.
యువరాజు, వంశీ లాంటి ప్లాపుల తరవాత మహేష్ బాబుతో మురారి అనే సినిమాని తెరకెక్కించారు కృష్ణవంశీ. 2001 ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా మహేష్ కెరీర్ కి మెయిన్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది.. ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తైన.. ఇప్పటికి ఈ సినిమా టీవీలో వస్తుందంటే.. ఈయన అభీఅమ్నులు టీవీ కి అతుక్కుపోయి మరీ ఈ సినిమా చూస్తుంటారు.
అంతలా ఈ సినిమా అందరికి నచ్చేస్తుంది. అయితే ఈ సినిమాలో ఇంకొక హైలైట్ ఏంటి అంటే మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం. చందమామ చందమామ కిందకి చూడమ్మ అనే పాట మనం ఇప్పటికి వింటూనే ఉంటాము .తెలుగు రాష్ట్రాల్లో ఏ పెళ్ళి జరిగిన కానీ ఈ పాట ఉండాల్సిందే.
అసలు మురారి కధ కృష్ణవంశీ మదిలో మెదలడానికి ఓ కారణం ఉందత. అదేమిటంటే.. ఈ సినిమా కధ పరంగా చూస్తే హీరో మహేష్ బాబు ముత్తాత, తాత, తండ్రి అందరి మరణాలకు ఒకటే కారణం.. అదే ఓ ఒక శాపం. ఆ శాపగ్రస్త కుటుంబం కధ కృష్ణవంశీ మదిలో మెదలడానికి కారణం ఏవ్రో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు. ఆ కధ ఆయనక్లి తట్టడానికి కారణం మరెవరో కాదు.. ఇందిరాగాంధీ కుటుంబం. యస్.. మీరు చదువుతున్నది నిజ్మే.. ఇందిరా గాంధీ కుటుంబం ఆధరంగానే ఈ సినిమా తెరకెక్కించాడట.
ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్ గాంధీ ను ఎవరో కాల్చి చంపారు.. అలానే ఇందిరాగాంధీ మరణం.. ఆ తరువాత సంజయ్ గాంధీ విమాన ప్రమాదం లో మరణించడం..ఆ తరువాత రాజీవ్ గాంధీ హత్య.. ఇలా ఇవన్నీ చూసి డైనమిక్ డరెక్టర్ కృష్ణవంశీ కు ఇదేమన్నా శాపగ్రస్త కుటుంబమా అని అనిపించి.. వెంటనే ఒక శాపగ్రస్త కుటుంబం కధ కృష్ణవంశీ మదిలో రూపుదిద్దుకుని.. ఆ కథను మహేష్ బాబు కు చెప్పితే.. ఆయన కు ఈ కధ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగనల్ ఇచ్చాడత. ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో మురారి సినిమా రూపుదిద్దుకుంని.. రిలిజై ఎమతటి ఘన విజయాని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.