జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ అంటే బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఆడియెన్స్ ను అలరిస్తున్న ఈ అమ్మడు ఆ ఒక్క షో ద్వారా చాలా పాపులర్ అయ్యింది. షోలో కామెడీతో పాటుగా అనసూయ అందాలు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. పొట్టి పొట్టి..బిగుతైన డ్రెస్సులు..ఒంటికి అతుక్కుపోయే శారీస్..మత్తెక్కించే మాటలు…డ్యాన్సులు ఇలా అన్ని రకాలుగా కుర్రాళ్ళ హృదయాలు కొల్లగొంట్టింది. అతి తక్కువ సమయంలోనే బుల్లితెరపైనే కాదు వెండి తెరపై కూడా హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది.
బుల్లితెర మీద తన అందాలతో అలరిస్తున్న అమ్మడు వెండితెర మీద కూడా వరుస అవకాశాలను అందుకుంటుంది. రంగస్థలం సినిమాలో ఆమె నటనతో అందరిని మెప్పించగా ఇంకా మరిన్ని ఛాన్సులు అందుకుంటుంది. అయసూయ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. సమయం దొరికినప్పుడల్లా తన అభిమానులతో తన భర్త అలాగే తన పిల్లల గురించి తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.
అనసూయ ఇటీవల తన భర్త భరద్వాజ్ ను గుర్తు చేసుకుంటూ ఒక పోస్ట్ ను పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. అయితే తాజాగా అనసూయ తన భర్త భరద్వాజ్ ముఖం మీద చిరునవ్వు ఉన్న ఫోటోను పంచుకున్నారు. ఆ ఫోటోని షేర్ చేస్తూ ఈ విధంగా క్యాప్షన్ ను పెట్టింది. నేను కేవలం మీ కారణంగా చాలా సంతోషంగా నవ్వుతూ జీవిస్తున్నాను. ఇది మీరు నా కోసం ఇచ్చే చిరునవ్వు అంటూ తన భర్తపై ఉన్న ప్రేమను మరొకసారి వ్యక్తం చేసింది. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.